ఈ మధ్య చాలా ప్రముఖ కంపెనీలలో లేఆఫ్ కొనసాగుతుంది.. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. దాంతో చాలా మంది ఉద్యోగం పోతుందనే టెన్షన్ లో ఉన్నారు.. ఎప్పుడు తమ ఉద్యోగం పోతుందా అన్న భయం మొదలైంది. కేవలం జీతంపై బతికేవారికి ఒక్కసారిగా ఉద్యోగం పోతే కష్టాలు తప్పవు. సేవింగ్స్ ఉన్నవారికి ఇబ్బంది లేదు కానీ, ఎలాంటి సేవింగ్స్ లేనివాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వారికి జాబ్ లాస్ ఇన్స్యూరెన్స్ కవర్ సాయంగా ఉంటుంది..
ఇలాంటి ఇన్సూరెన్స్ ఒకటి ఉందా అని చాలా మందికి తెలియదు.. కారణం ఇలాంటి ఇన్స్యూరెన్స్ పాలసీలు ఎక్కువగా లేకపోవడమే. కేవలం కొన్ని ప్రైవేట్ బీమా కంపెనీలు మాత్రమే ఈ ఇన్స్యూరెన్స్ కవర్‌ను అందిస్తున్నాయి. కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు వీటిని యాడ్ ఆన్ పాలసీల లాగా అందిస్తున్నాయి. కొంత మొత్తం ప్రీమియం చెల్లిస్తే, ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కొన్ని నెలల పాటు వారి వేతనానికి సమానంగా ప్రతీ నెలా ఇన్స్యూరెన్స్ కంపెనీ డబ్బులను ఇస్తుంది.. క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ లేదా హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో కలిపి యాడ్ ఆన్‌గా ఈ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
ఈ పాలసీలు తీసుకున్నవారికి ఈఎంఐల భారం కొంత కాలం ఉండదనే చెప్పాలి. ఉదాహరణ కు హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో పాటు యాడ్ ఆన్‌గా జాబ్ లాస్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఉద్యోగం పోయిన, లేకుంటే ఏదైనా అనారోగ్యం వచ్చిన కూడా బీమా కంపెనీ హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తుంది… ప్రభుత్వం కూడా భీమా ను ఇస్తుంది..రాజీవ్ గాంధీ శ్రామిక్ కళ్యాణ్ యోజన పథకం కింద ఇలాంటి ప్రయోజనాన్ని పొందవచ్చు.. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం కూడా ఉంది. ఈ పథకం లో ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోతే మూడు నెలలు ప్రభుత్వం నుంచి వేతనం పొందొచ్చు.. ఒకసారి మాత్రమే మీకు ఇది వర్తిస్తుంది..