బెంగాల్‌లో బీసీలకి 27 శాతం రిజర్వేషన్ లు ఉంటే అందులో 17 శాతం ముస్లింలకి, 10 శాతం హిందూ బీసీలకి అన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతియ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ… ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ లో కూడా అదే పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు. హైదరాబాదులో బీసీ రిజర్వేషన్‌లలో ముస్లింలు పోటీ చేస్తున్నారు… బీసీ లకు అన్యాయం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ లని 12 శాతం కి పెంచుతామని అసెంబ్లీ లో తీర్మానం చేశారని, ముస్లిం లకి పెద్ద పీట వేస్తున్నారన్నారు. దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నారు… బీసీ లకు లక్ష రూపాయలు భిక్ష వేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. బీసీ లను చిన్న చూపు చూస్తున్నారని, వారి పట్ల ఈ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తున్నదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయంను ప్రజలలో కి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు.
Also Read : Government Jobs : BDL లో ఉద్యోగాలు..రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. రూ.39,000 జీతం..
తెలంగాణలో ఫీ రీయింబర్స్ మెంట్ కేవలం ముస్లిం, క్రిస్టియన్‌లకు మాత్రమే ఇస్తూ ఓబీసీ విద్యార్థులకు మాత్రం ర్యాంక్ ఆధారంగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయించారని ఆ వివరాలు ఎందుకు ప్రజలకు చెప్పడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక 2014 తర్వాతనే ఎన్ సీబీసీకి రాజ్యాంగ హోదా వచ్చిందని, కేంద్ర విద్యాలయాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మోడీ సర్కారుదన్నారు.
Also Read : Uttarakhand: “లవ్ జిహాద్”తో అట్టుడుకుతున్న పురోలా.. మహాపంచాయత్‌కి నిరాకరణ