టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు హఠాత్తుగా దళితులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుంది కదా అందుకే.. చంద్రబాబుకు అన్ని వర్గాల మీద ప్రేమ పుట్టుకు వస్తుందని దుయ్యబట్టారు.
సౌత్ ఆఫ్రికాలోని నైజీరియాలో ఘోరం జరిగింది..ఘోర పడవ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం లో 103 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు.. క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటన లో 103 మంది మరణించారు. ఉత్తర మధ్య నైజీరియా లో పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న అతిథుల పడవ నీట మునిగింది.. ఈ ప్రమాద సమయంలో 200 మందికి పైగా ప్రయానిస్తున్నారని, మొత్తం నీట మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఒకేసారి…
మనం ఏదైనా పని చేయాలంటే మూడ్ బాగుండాలి. అంతేకాకుండా ఆ పని చేసేందుకు మానసికంగా సిద్ధమైనప్పుడే పని చేయగలుగుతాం. కొన్నిసార్లు మనతో ఉన్న వ్యక్తులు.. మనల్ని కించపరిచేలా.. తిట్టినా ఇట్టే మనకు కోపమొచ్చి ఆ పని మీద ఇంట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. మన మానసిక స్థితికి , మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శిరీష ఎక్కడైతే మృతి చెందిందో.. ఆ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం శిరీష ఇంటికి వెళ్ళి శిరీష తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా శిరీష మృతికి ముందు ఇంట్లో జరిగిన గొడవపై కూడా ఆరా తీశారు.
తెలంగాణ ఈసెట్ -2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాలను మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ వెల్లడించారు. ఈసెట్ ఫలితాల్లో ఈ ఏడాది 93.07 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పీయూసి ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపికగా గుర్తించారు. మృతురాలు స్వస్థలం సంగారెడ్డి జిల్లా గొర్రెకల్.