భువనగిరి జిల్లా రాయగిరి రైతులను భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ట్రిపుల్ ఆర్ భూముల అంశంలో పోరాటం చేస్తూ జైలుకు వెళ్లొచ్చిన రాయగిరి రైతులను కలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. జైలుకు వెళ్లిన రైతులందరికీ భూములు ఉన్నాయన్నారు. డీసీపీ వెంటనే రాయగిరి రైతులకు క్షమాపణ చెప్పాలని, ఐపీఎస్ చదువుకున్నావా.. ఇదేనా నీ జ్ఞానం..? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పినట్టు డీసీపీ నడుచుకోవడం కరెక్ట్ కాదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. అధికార పార్టీ నాయకులు రేపటి నుంచి ఈ ప్రాంతంలో ఎలా తిరుగుతారో చూస్తానని ఆయన వ్యాఖ్యానించారు. భూ సేకరణ అంశం కేంద్రానికి సంబంధించింది కాదని కేంద్ర రవాణా శాఖ మంత్రి చెప్పారన్నారు.
Also Read : Pawan Kalyan: ముందస్తు ఎన్నికలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు..
ట్రిపుల్ ఆర్ భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని, రాయగిరి రైతులకు సంకెళ్లు వేయడంతో రాష్ట్రంలో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. పోలీస్ అధికారులు ప్రభుత్వ మాటలు వినకండి.. కేసీఆర్ ప్రభుత్వం ఉండేది ఇంకా ఆరు నెలలు మాత్రమేనని, డీసీపీ వెంటనే తన స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో గెలిచేవాడు లేడు.. ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చేది లేదని ఆయన అన్నారు. పోయేకాలం వచ్చింది కాబట్టే ఓఆర్ఆర్ అమ్మారని, ఓఆర్ఆర్ ఇష్యూలో లక్షల కోట్ల స్కాం చేశారు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. ఓఆర్ఆర్ అమ్మడం అంటే.. దివాలా తీసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Akkineni Nagarjuna: నాగ్ మామ ఏంట్రా.. ఇలా మారిపోయాడు