గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనుచరులు, కార్యకర్తలతో కలిసి నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరి రావు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ లో సెల్ఫీలు దిగే వారు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేవారు ఎక్కువయ్యారంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్, దానం నాగేందర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నానని, గ్రేటర్ లో మెట్రో నిర్మించింది కాంగ్రెస్ కాదా? సవాల్ విసురుతున్నామన్నారు రేవంత్. నగరంలో మత సామరస్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Adipurush: నార్త్ లో మెంటల్ ఎక్కిస్తున్న ఆదిపురుష్ క్రేజ్
అంతర్జాతీయ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్. అని, పదేళ్లలో బీఆరెస్ నేతలు చేసిందేం లేదన్నారు. అంతేకాకుండా.. ‘మూసిని కూడా కబ్జాలు చేసిన ఘనత బీఆరెస్‌ది. కాలువలో పడి పిల్లలు చనిపోతే పట్టించుకునే దిక్కు లేదు. నగరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. కార్యకర్తలు బస్తీ బాట పట్టి ప్రజలకు చేరువ కావాలి. నోముల ప్రకాష్ గౌడ్ ను కాంగ్రెస్ లోకి సాదర స్వాగతం ప్రకాష్ గౌడ్ సేవలను ఉపయోగించుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తాం. కాంగ్రెస్ ను గెలిపించి పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం. జంట నగరాల నుంచి అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి.’ అని ఆయన అన్నారు.
Also Read : Cricket: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా అతనే కరెక్ట్.. రోహిత్ కన్నా బెటర్..!