కొత్త సంవత్సరం సంబరాలు సంతోషంగా జరుపుకోవాలని, వాహన దారులు నిబంధనలు ఉల్లంఘిస్తే..కటిన చర్యలు తప్పవన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్. డ్రంకెన్ డ్రైవింగ్ తో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ..ప్రాణాలు తీసుకోవద్దని సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. పోలీస్ ల శిక్షల కంటే.. వాహన దారుల్లో మార్పులు రావాలన్నారు. బార్ లు , పబ్బుల వద్ద సరిఅయిన పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, ఎన్టీ ఆర్ ఘాట్ , నక్లేస్…
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు.
తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. ‘రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా…
వానాకాలం, యాసంగి 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ డా.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, పౌర సరాఫరాల శాఖ అధికారులతో కష్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) వానాకాలం, యాసంగి పై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వానాకాలం, యాసంగి 2022-23 కు సంబంధించి…
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను నిండా ముంచారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ పరిశీలన, అవగాహణకు రివ్యూ నిర్వహించారు భట్టి విక్రమార్క. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ చేతిలో పెడితే అభివృద్ధి చేసిందేమీ లేదని.. అన్ని రంగాలను ఆందోళన కలిగించే దృస్థితికి తెచ్చారని అన్నారు. అంకెలు, సంఖేలు ఆందోళనకరంగా వుందన్నారు. లెక్కలు చూస్తే ఆశ్చర్యకరంగా వుందని, పవర్ సెక్టార్ 81,516 కోట్ల రూపాయలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రభుత్వ. నుంచి డిస్కంలకు…
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.
న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసులు సరికొత్త స్టెప్ తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోని డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్‌ను రంగంలోకి దించింది నార్కోటిక్ టీం. రేపటి నుంచి పరీక్షలు చేయడానికి నార్కోటిక్ బ్యూరో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి వికారాబాద్ జిల్లా కొడంగల్ను ప్రధాన కేంద్రంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సుకన్య సమృద్ధి యోజన, ప్రభుత్వ పొదుపు పథకం "బేటీ బచావో, బేటీ పడావో" చొరవలో కీలకమైన భాగం. ఆడపిల్లల ఉద్ధరణ, సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రజలను నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభినందించారు. భారతదేశంలో సోదరభావం తగ్గిపోతోందని, దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.