CP Vishwaprasad : డ్రంకెన్ డ్రైవింగ్‌తో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త సంవత్సరం సంబరాలు సంతోషంగా జరుపుకోవాలని, వాహన దారులు నిబంధనలు ఉల్లంఘిస్తే..కటిన చర్యలు తప్పవన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్. డ్రంకెన్ డ్రైవింగ్ తో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ..ప్రాణాలు తీసుకోవద్దని సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. పోలీస్ ల శిక్షల కంటే.. వాహన దారుల్లో మార్పులు రావాలన్నారు. బార్ లు , పబ్బుల వద్ద సరిఅయిన పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, ఎన్టీ ఆర్ ఘాట్ , నక్లేస్ రోడ్ లలో..బైక్ లపై ఫీట్ లు చేస్తూ.. అమ్మాయిలను వేధించే వారి పట్ల మాకు వ్యూహం వుందన్నారు. వారి వీడియో లు రికార్డ్ చేసి..తరువాత అరెస్ట్ చేస్తామన్నారు. ఫ్లైఓవర్ లు మూసి వేస్తాము..వాహన దారులు సహకరించాలన్నారు. కొత్త సంవత్సరం లో తెల్ల వారే వరకు మేము తనిఖీలు చేస్తామన్నారు.
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
డిసెంబర్ 31 ఆదివారం రాత్రి 10.00 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు పెద్ద ఎత్తున చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, మైత్రివనం బోరబండ డివిజన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం, వాహనాల పై భాగంలో ప్రయాణించడం, బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితి మీరిన శబ్దాలు, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, వాహనాలపై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా, బాధ్యతగా సురక్షితంగా వాహనాలు నడిపి నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు కోరారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!