అమెరికాలో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయింది. వారి మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో మసాచుసెట్స్‌లో వారి విలాసవంతమైన భవనంలో భారతీయ సంతతికి చెందిన సంపన్న దంపతులు, వారి కుమార్తె చనిపోయినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో సిమెంట్ బస్తాలను తీసుకెళ్తున్న ట్రక్కు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. సమీపంలో ఆగి ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, రాజౌరి జిల్లాల్లో రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి జరిగిన తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన వారం తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు.
పాకిస్థాన్‌లో 2024 నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ సారి నూతన సంవత్సర వేడుకలను చేసుకోకూడదని పాకిస్థాన్ నిర్ణయించింది.
గెలిచే వారికే పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు మంత్రి జోగి రమేష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా అనుచరులు పెడన నుంచే పోటీ చేయాలి అని కోరుకుంటున్నారన్నారు. నేను కూడా పెడనలోనే ఉండాలని అనుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల బట్టి జగన్ నేను పెడన నుంచి పోటీ చేయాలా వేరే చోటు నుంచి చేయాలా నిర్ణయం తీసుకుంటారని జోగి రమేష్ అన్నారు. ప్రజల్లో ఆదరణ లేకుంటే పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకుంటుందని, అధిష్టానం…
వేసవిలో విద్యుత్ కొరత రాకుండా రాష్ట్రంలో అన్ని థర్మల్ కేంద్రాలకు, ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ కేంద్రాలకు బొగ్గును నిరంతరాయంగా ఉత్పత్తి చేసి రవాణా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సింగరేణిలోని అన్ని విభాగాలపై సమగ్రంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి ఉపరితల భూగర్భగనులు మరియు నూతన ప్రాజెక్టులు, సింగరేణి థర్మల్ ప్రాజెక్టు మరియు సోలార్ ప్రాజెక్టులు, మిషనరీ వినియోగం, బొగ్గు మార్కెటింగ్, రవాణా పై ఆయా విభాగాల…
కరీంనగర్ జిల్లాలోని అన్నారం బ్యారేజీని మంత్రుల బృందం సందర్శింది. బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అన్నారం బ్యారేజీకి బుంగలు పడి ఇసుక బయటకు వస్తున్న ప్రాంతాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. ప్రాజెక్టు లో లోపాలన్ని మానవ తప్పిదాలే… లోపాలపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా Ntvతో మంత్రి…
యాపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజె వేరు.. ఈ బ్రాండ్ లో ఏదైనా ఫోన్ తమతో ఉంటే బాగుండు అని యూత్ అనుకుంటారు.. ఈ మధ్య ఇదే ట్రెండ్.. అయితే ఐఫోన్ కొనాలని అనుకొనేవారికి ఇది మంచి సమయం.. న్యూయర్ కు మంచి ఆఫర్ ను యాపిల్ ప్రకటించింది.. ఐఫోన్ 15 ధరపై భారీ తగ్గింపు ను ప్రకటించింది.. కొన్ని బ్యాంక్ కార్డుల పై ఫోన్ ను కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు..…
తన ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రెండు ప్రధాన ప్రకటనలు చేశారు. వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 60 నుండి 50 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు, రాష్ట్రంలో స్థాపించే కంపెనీలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేయబడతాయని సీఎం హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు చేశారు.
జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం తెలిపాయి.