Revanth Reddy : ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లేని ప్రైవేటు యూనివర్సిటీలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యాంగబద్దంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయంబర్సుమెంటు, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదిను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మౌళికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా విద్యను అందిస్తున్నాయో నివేదికను ఇవ్వాలన్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇండ్ల ప్లాట్లకు రిజిష్ట్రేషను అయిన భూములను, ధరణిలో చూపించినా ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని, అలాంటివాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇండ్ల స్థలాల కింద రిజిష్ఠరు అయిన, వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబధించి సమగ్రంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగంపైనా సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!