కొత్త సంవత్సరమంటే డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి 12 గంటలు దాటుతున్న టైంలో సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఆ సమయంలో ప్రపంచమంతా ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్తారు. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు 2024కు వెరైటీగా స్వాగతం పలికారు. వారు ఒకే న్యూ ఇయర్ ను 16 సార్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఐఎస్ఎస్.. భూమి చుట్టూ రోజుకు 16 సార్లు తిరుగుతుంది. ప్రతి 92.9 నిమిషాలకు ఒక సారి భూమిని చుట్టి వస్తుంది. ప్రతి సారి భూమిపై ఉన్న 90 శాతం జనాభాను వ్యోమగాములు కవర్ చేస్తుంది.
Read Also: RGV : న్యూయర్ పార్టీలో అమ్మాయితో రచ్చ చేసిన ఆర్జీవి.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
అయితే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు 12 గంటల పగలు, 12 గంటల రాత్రి ఉంటుంది. భూ భ్రమణంలో భాగంగా వారు 45 నిమిషాల పగలు, 45 నిమిషాల రాత్రిని చూస్తారన్న మాట. దాంతో వారు కేవలం ఒక రోజులోనే 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు వీక్షిస్తారు. అలా 16 భ్రమణాల్లో పదే పదే న్యూ ఇయర్‌ను చూశారు. ఈ అంతరిక్ష కేంద్రాన్ని 15 దేశాలు కలిసి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి అక్కడకు వ్యోమగాములు వెళ్తూన్నారు. ఆరు పడగ గదుల ఇల్లు పరిమాణం కంటే పెద్దగా ఉండే ఈ స్పేస్ స్టేషన్‌లో సాధారణంగా ఏడుగురు వ్యోమగాములు పని చేస్తారు. దాదాపు రెండు సంవత్సరాల(665 రోజులు) పాటు స్పేస్ స్టేషన్ లో డ్యూటీ నిర్వహించిన వ్యక్తిగా 2017లో అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్సన్ రికార్డు నెలకొల్పాడు.