Xi Jinping: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా డ్రాగన్ కంట్రీ చైనా పేరుగాంచింది. అయితే, గత కొంతకాలంగా చైనా ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. కరోనా అధ్యాయం ముగిసిన తర్వాత నుంచి తమ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ దేశ అగ్రనాయకత్వం వెల్లడించారు. కానీ, చైనా అధినేత షీ జిన్ పింగ్ మాత్రం ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు. తాజాగా ఈ అంశంపై జిన్ పింగ్ రియాక్ట్ అయ్యారు. ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నట్ల మాట నిజమేనన్నారు.
Read Also: Municipal Staff Strike: మున్సిపల్ కార్మికుల సమ్మె.. చర్చలు సఫలం అయ్యేనా..?
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రస్తావించారు.. దేశంలోని వాణిజ్య, వ్యాపారాలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి.. నిరుద్యోగులు ఉపాధి వేటలో ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన చెప్పారు. అయితే, 2013 నుంచి ప్రతి ఏటా జిన్‌పింగ్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రసంగం చేస్తున్నారు. ఆ స్పీచ్ లో ఆర్థిక సవాళ్ల గురించి ప్రస్తావించడం ఇదే ఫస్ట్ టైమ్.
Read Also: Delhi : రికార్డు.. న్యూ ఇయర్ సందర్భంగా 24లక్షల సీసాలు పీల్చేశారు
కొన్ని సంస్థలు గడ్డు పరిస్థితులను చవిచూస్తున్నాయని జిన్ పింగ్ అన్నారు. ఉద్యోగాలు లేక, కనీస అవసరాలు తీరక కొంతమంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.. ఈ సమస్యలపై నేను కూడా ఆలోచిస్తున్నా.. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోకి తెచ్చేలా వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిన్ పింగ్ ప్రసంగం ముగిసిన తర్వాత.. చైనా జాతీయ గణాంకాల సంస్థ.. నెలవారీ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) నివేదికను రిలీజ్ చేసింది. డిసెంబర్ లో ఫ్యాక్టరీ కార్యకలాపాలు ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయినట్లు అందులో వెల్లడించింది. పీఎంఐ సూచీ తగ్గడం వరుసగా ఇది మూడో నెల కావడం గమనార్హం.