వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు లిస్ట్‌లను విడుదల చేసిన వైసీపీ అధిష్ఠానం ఐదో జాబితా కోసం కసరత్తు మొదలుపెట్టేసింది. నాలుగు లిస్టుల్లో ఊహించని వారి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐదో జాబితాపై వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
గతంలో ఒకే క్లాత్‌పై జి20 లోగోను నేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల టెక్స్‌టైల్ టౌన్‌కు చెందిన నేత వెల్ది హరిప్రసాద్, అయోధ్య శ్రీరామ మందిరంలోని సీతాదేవికి బంగారు చీరను నేసి మరో రికార్డు సృష్టించారు. జనవరి 22న జరగనున్న శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా హరిప్రసాద్ బంగారు చీరను నేసారు. 900 గ్రాముల చీరను ఎనిమిది గ్రాముల బంగారం, 20 గ్రాముల పట్టు చారలతో 20 రోజులు వెచ్చించి నేశారు. శ్రీరాముని చిత్రాలతో పాటు,…
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 22న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని, దైవ కార్యాన్ని రాజకీయం చేయొద్దన్నారు. రాముడు BJPకి మాత్రమే దేవుడు కాదని, ఈ అంశాన్ని తమ పార్టీకి ఆపాదించి వివాదాస్పదం చేయొద్దని అన్నారు. తాజాగా- బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ ఈ కార్యక్రమంలో…
పీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా, కీలక నేతలు తమ పట్టును నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్‌కళ్యాణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ యాప్స్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాలుగు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ యాప్స్‌ను మంత్రి ఆవిష్కరించారు.
బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు ఈ నెల 21వ తేదీ లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి పొడిగింపు కోసం వాళ్లు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
చిరకాల మిత్రదేశాలైన ఇజ్రాయెల్- అమెరికా మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. హమాస్ నియంత్రణలోని గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడానికి ఇదే సరైన సమయమంటూ చేసిన అమెరికా చేసిన సూచనను ఇజ్రాయెల్ తిరస్కరించింది.
సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ పురస్కారాలు ఒకటి.. సినీ నటీనటులు తన నటన ద్వారా అందరిని మెప్పించి ఈ అవార్డులను అందుకోవాలని భావిస్తుంటారు.. నామినేషన్లలో అర్హత సాధించినా గొప్ప విషయంగానే భావిస్తారు. ఈ పురస్కారాలకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ అలాంటిది మరి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని చిత్రపరిశ్రమలు ఈ అవార్డ్స్ కోసం పోటీపడుతుంటాయి. ఇప్పటివరకు భారత్ నుంచి పలు చిత్రాలు, నటీనటులు ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అయ్యారు.. ఆయన మరెవ్వరో…