అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-గాజా యుద్ధం ఆగిపోయే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ రక్తపాత సంఘర్షణలో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సుమారు 16 వేల మంది ఈ యుద్ధంలో మరణించారు.
2017లో జరిగిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యతో సంఘ్‌కు సంబంధం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వేసిన పరువునష్టం కేసులో లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి థానే కోర్టు 500 రూపాయల జరిమాన విధించింది.
ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితులను భట్టి చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా కనిపిస్తుంది. మొదట రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది.. ఆ తర్వాత ఇజ్రాయెల్-హమాస్ వివాదం కొనసాగుతుంది.. ఇప్పుడు హౌతీ యెమెన్ యుద్ధం ఈ మూడు కారణాల వల్ల థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందా? అనే పరిస్థితులతో ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతుంది.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు.. ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు ఎదుర్కుంటున్న సమస్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో అద్దె బస్సుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అద్దె బస్సుల యజమానులు స్వాగతించారు.. కాని తమ బస్సుల పై పడుతున్న భారాన్ని మంత్రి దృష్టికి…
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నన్ను తప్పించి మరొకరిని అభ్యర్థిగా ప్రకటించడం అధిష్టానం ఇష్టమన్న ఎమ్మెల్యే ఆర్థర్.. గతంలో కూడా వేరే వాళ్ళను తప్పించి తనకు టికెట్ ఇచ్చారని వెల్లడించారు.
నిద్రలేమి అనేది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే సమస్య మరియు కొంతమందికి, మంచం మీద పడుకున్న నిమిషాల్లో నిద్రపోవడం ఒక బహుమతి. మనల్ని ఆరోగ్యంగా మరియు చురుగ్గా ఉంచడానికి నిద్ర మన జీవితంలో ముఖ్యమైన భాగం. ప్రతి రాత్రి తగినంత నిద్ర పొందడం మన మొత్తం శ్రేయస్సుకు అవసరం. నిద్ర లేకపోవడం బరువు పెరగడం నుండి అనేక దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితుల వరకు అనేక రకాలుగా ఒకరి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ప్రతి రాత్రి బాగా…
ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను…
లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్ మరియు బ్రిటన్ మధ్య బలమైన బంధాలలో ఒకటైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం…’అన్నారు. వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను యునెస్కో 1016 సంవత్సరంలోనే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక…
పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ యువకులను మాయ మాటలతో లోబర్చుకుని హోమో సెక్స్ కు పాల్పడుతున్న వైద్యుడు డాక్టర్ జవ్వాద్ అలి ఖాజాపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వైద్యుని భార్య అంజుమ్ బేగం విజ్ఞప్తి చేశారు. మౌలాలికి చెందిన డాక్టర్ జవ్వాద్ అలి ఖాజాతో తనకు 2014లో వివాహం జరిగిందని, తమకు ఇద్దరూ పిల్లలు ఉన్నారని ఆమె తెలిపారు. వివాహ సమయంలో తమ తల్లిదండ్రులు జవ్వాద్ కు కట్నకానుకల కింద 25 లక్షల…
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త, మాజీ పీపుల్స్ వార్ నేత గాలన్న గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు కరీంనగర్లో లైఫ్ లైన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.