రెండు మూడు రోజుల్లో సీతారామ ప్రాజెక్టుల సందర్శనకు మంత్రులందరం వెళతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాము ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పించారు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అని ఆయన మండిపడ్డారు. 1500 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టులు 2981 కోట్లకు అంచనా వ్యయం పెంచారన్నారు. ఇరిగేషన్ మంత్రిగా నేనే నిర్ఘాంత పోయా.. ఇరిగేషన్ శాఖను ద్వంసం చేశారని, 94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరంలో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదన్నారు.…
ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
భారత పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి.. సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు బెల్‌గ్రేడ్‌లో జరిగే.. 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ (ITF)కు హాజరుకావాలని.. సెర్బియా పర్యాటక శాఖ మంత్రి శ్రీ హుసేన్ మెమిక్ ఆహ్వాన పత్రాన్ని పంపించారు. యూరప్, సెర్బియా ప్రాంతంలో పర్యాటక రంగాభివృద్ధికి జరిగే అతిపెద్ద ఈవెంట్కా ఇది. గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోండగా.. ఈసారి ‘అడ్వెంచర్ బిగిన్స్ హియర్’ అనే…
మూసీ నది పునరుజ్జీవన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు, మూసీ ప్రాజెక్టుకు అపెక్స్ బాడీ మద్దతు మరియు భాగస్వామ్యానికి హామీ ఇచ్చింది. థేమ్స్ నది అపెక్స్ గవర్నింగ్ బాడీ అధికారులతో ముఖ్యమంత్రి బహు కోణాల అంశాలు మరియు విభిన్న వాటాదారుల ప్రభావ అధ్యయనాలపై చర్చించారు. మూసీ నది కానీ హుస్సేన్‌సాగర్ సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉండటం మరియు ఉస్మాన్‌సాగర్ వంటి ఇతర ప్రధాన నీటి వనరుల…
సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. అంబేడ్కర్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని సీఎం వెల్లడించారు.
జాంబియాకు చెందిన 7 ఏళ్ల బాలిక తన 14 ఏళ్ల సోదరుడికి బోన్ మ్యారోను దానం చేయడంతో సికింద్రాబాద్‌లోని కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) హాస్పిటల్‌లోని సర్జన్లు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (BMT)ని విజయవంతంగా పూర్తి చేశారు. జాంబియాలోని లుసాకాకు చెందిన కుటుంబం సికిల్ సెల్ వ్యాధితో తీవ్రంగా పోరాడుతున్న తమ కొడుకు కోసం కిమ్స్ ఆసుపత్రిలో వైద్య సహాయం కోరింది. BMT విభాగాధిపతి, హెమటో-ఆంకాలజిస్ట్ మరియు BMT నిపుణుడు డాక్టర్ నరేందర్ కుమార్…
ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకువస్తామని వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావడం వల్ల తెలంగాణపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు నీరు చాలా కీలకమని, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని…
భారతదేశంలో 355 కొత్త కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల ఒక్క రోజు పెరుగుదల నమోదైంది. దేశంలో ఇప్పుడు క్రియాశీల కేసుల సంఖ్య 2,331 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.. శుక్రవారం INSACOG ప్రకారం, దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,378 COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి, మణిపూర్ దాని ఉనికిని గుర్తించిన తాజా రాష్ట్రంగా అవతరించింది.. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) అనౌన్స్ చేసిన డేటా ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 320…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పారని, అదానీ గ్రూపుతో 12వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయని ప్రకటించారన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అదానీ, అంబానీకీ మోడీ దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారని, పని గట్టుకొని ప్రధానిపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. కేటీఆర్ తెలంగాణ ప్రతినిధిగా ఐదు సార్లు దావోస్ పర్యటనకు వెళ్లారని, గత ప్రభుత్వం 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని గొప్పగా…
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లైఫ్ స్టైల్ బిల్డింగ్ మొదటి అంతస్తులో గల ఆరోరా బ్యాంకెట్స్ హోటల్ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పక్కన ఉన్న ఆయిల్ కు మంటలు అంటుకొని చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన సిబ్బంది మరియు కస్టమర్స్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్ లోని అన్ని దుకాణాలలో ఫైర్ సేఫ్టీ అల్లారం మోగడంతో భయాందోళనలకు…