వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ – కాంగ్రెస్ కూటమికి మద్య పోరాటమన్నారు వరంగల్ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బీఆర్‌ఎస్ పార్టీ ఎవరితో ఉన్నారు.? అని ఆయన ప్రశ్నించారు. ఒకటీ రెండో చోట్ల బీఆర్‌ఎస్ గెలిస్తే ఇండియా కూటమికి సహకరిస్తారా..? బీజేపీ కి మద్దతిస్తారా..? అని ఆయన అన్నారు. ఎంఐఎం పార్టీ బీజేపీ అంతా మత ఉన్మాదం కలిగిన పార్టీలా మేం భావించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలి… ఆ పార్టీ దారి తప్పితే దానికి వైద్యం…
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కొత్త తండాలో సీఎస్‌ఆర్ నిధుల నుండి 25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం భవనం, 13 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రంను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచ్ మరియు ఎంపీటీసీ జడ్పీటీసీల హక్కులను హరించిందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు నిధులు ఇవ్వకుండా, వారిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి…
బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టేందుకు ప్రధాని మోదీ , సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు మోడీకి గానీ, రేవంత్‌రెడ్డికి గానీ భయం లేదని , తెలంగాణ ప్రజల గొంతుకగా పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ , సీనియర్ జర్నలిస్టు…
నేడు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిటీలతో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార విధివిధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
తిరుమలలో రద్దీ భారీగా తగ్గింది. ఇవాళ ఆదివారం అయినా రద్దీ పెద్దగా కనిపించడం లేదు.. అయితే, సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో పాటు పరీక్షలు కూడా దగ్గరపడుతుండటంతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు పేర్కొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంట ప్రాణం తీసుకుంది. నదిలో పడి ఒకరు, రైలు కింద పడి మరొకరు మృతి చెందారు. అయితే, కొమరాడ మండల కేంద్రానికి చెందిన పద్మజ తోటపల్లి బ్యారేజిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చెందిన వానపల్లి శ్రావణ్ కుమార్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో జీ2 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.. జనవరి 8 న ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..…
ఢిల్లీలో దారుణ ఘ్తన చోటు చేసుకుంది.. షాహదారా ప్రాంతంలోని తన ఇంట్లో డబ్బు దొంగిలించడానికి 77 ఏళ్ల అమ్మమ్మను చంపినందుకు 15 ఏళ్ల బాలుడు తన స్నేహితుడితో కలిసి అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు..ప్రధాన నిందితుడి నుంచి చోరీకి గురైన రూ.14,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంటి మంచంపై వృద్ధురాలు శవమై కనిపించింది.ఆమె శరీరంపై ఎలాంటి బాహ్య గాయం కనిపించకపోవడంతో…
నియోజకవర్గ మార్పుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కన్నీటిపర్యంతం అయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రిని గోపాలపురం వైసీపీ ఇంఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. సీట్లు దక్కనివారు, ఆశిస్తున్నవారు పార్టీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.