టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి వెళ్లింది.. సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ తోనూ కలిసి నటిస్తూ కెరీర్ ను మాంచి స్వింగ్ లో తీసుకెళ్తోంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ వరుస అవకాశాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది.
రీసెంట్ గా మహేష్ బాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపిస్తోంది.. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ అమ్మడు తన గురించి నమ్మలేని నిజాన్ని బయట పెట్టింది.. ఈ అమ్మడు మాట్లాడుతూ.. నేనెప్పుడూ స్విచ్చాన్, స్విచ్చాఫ్ పర్సన్ లా ఉంటాను. అది నా బలంగా ఫీలవుతున్నాను. ఒకేరోజు మూడు సినిమాల్లో మూడు క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినా, ఏమాత్రం ఇబ్బంది ఉండదు.
ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి ఈజీగా ఒదిగిపోతాను. సెట్లో ఉన్నంత సేపు యాక్టింగ్ తప్ప మరో ధ్యాస ఉండదు. సెట్ నుంచి బయటకొచ్చానంటే సినిమా గురించి అస్సలు ఆలోచించను. సినిమాల్లోనే కాదు, చదవు విషయంలోనూ ఇలాగే ఉంటాను.. బుక్ పట్టుకుంటే నేను ఖచ్చితంగా చదవాలి అనే ఆలోచనతో ఉంటాను అని చెప్పింది.. ఇటీవల వచ్చిన గుంటూరు కారం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక మరో రెండు ప్రాజెక్టు లలో నటిస్తుంది.. త్వరలోనే వాటి గురించి ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది..