Mint Compound: హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా ఇవాళ మింట్ కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముద్రణా యంత్రాలు, పలు పుస్తకాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి తీసుకు రావడంతో పెను ప్రమాదం తప్పంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొనింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.