Rajyasabha Election Schedule: దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలింగ్ జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. ఈ రాజ్యసభ స్థానాలకు చెందిన 50 మంది సభ్యులు ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనుండగా, ఆరుగురు ఏప్రిల్ 3న పదవీ విరమణ చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది.
Read Also: Kota: “మమ్మీ, డాడీ, ఈ జేఈఈ నావల్ల కాదు”.. కోటాలో మరో ఆత్మహత్య..
నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16వ తేదీగా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరు స్థానాలకు గానూ.. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలింగ్ జరగనుంది.
ఎన్నికలు జరిగే 15 రాష్ట్రాలు
1. ఆంధ్రప్రదేశ్
2. ఛత్తీస్‌గఢ్
3. గుజరాత్
4. హర్యానా
5. హిమాచల్ ప్రదేశ్
6. కర్ణాటక
7. మధ్యప్రదేశ్
8. మహారాష్ట్ర
9. తెలంగాణ
10. ఉత్తర ప్రదేశ్
11. ఉత్తరాఖండ్
12. పశ్చిమ బెంగాల్
13. రాజస్థాన్