Kishan Reddy : 1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్‌ను వాజ్‌పేయి ప్రవేశ పెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ మహిళ స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓస్ సంపర్క్ అభియాన్ ఆధ్వర్యంలో హయత్ నగర్ లోని ఓ హాల్ లో నిర్వహించిన కార్యశాల కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్ ను వాజ్‌పేయి ప్రవేశ పెట్టారన్నారు. ఇప్పుడు వేలాది స్వయం సహాయక సంఘాల ఏర్పడ్డాయని, ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసినా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. ఈ సంఘాలకు ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వమన్నారు. బ్యాంకులు కూడా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా సమయంలో ఆర్థిక సాయం పై మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు కిషన్ రెడ్డి. ఎలాంటి డిఫాల్ట్ లేకుండా రుణాలు కడితే వారికి 20లక్షల రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని, రుణాల పై 7శాతం రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు. కాని ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ వడ్డీ చెల్లించలేదని ఆయన మండిపడ్డారు. స్వయం సహాయక సంఘాల ఉంటే ఆ ప్రాంతంలో సమస్యలపై మాట్లాడుతారు.. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, స్వయం సహాయక సంఘాల ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి. స్వయం సహాయక సంఘాలు ఒక పెద్ద శక్తి అని, ఎన్నికలు, రాజకీయాలు పక్కన పెట్టి స్వయం సహాయక సంఘాల పై దృష్టి సారించాలన్నారు.
అంతేకాకుండా.. ‘మూడున్నర కోట్ల ఇండ్లు పేద మహిళలకు ఇచ్చారు. ఎన్ని గ్యాస్ కనెక్షన్లు అయినా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. ప్రతి ఏటా ఒక మహిళ కు స్టాండప్ కింద పది లక్షల నుంచి 10కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని నిబంధనల పెట్టాం. మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చిన వ్యక్తి ప్రధాని మోడీ. మహిళల సైనికులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత లో కూడా దేశ రక్షణ కోసం బార్డర్ లో పని చేస్తున్నారు. పాకిస్థాన్ లో జరిగిన ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ లో మహిళా పైలెట్ పాల్గొన్నది. మహిళా స్వయం సహాయక సంఘాల వద్దకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పథకాలు వివరించాలి. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం. గతం లో తెలంగాణా లో ఏప్రిల్ 14న ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల కు వారం రోజుల అటూ ఇటూగా ఎన్నికలు జరగవచ్చు… అందరూ సిద్దం గా ఉండాలి. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి. ఆ కుంభకోణాలు ఉండకూడదు అనే బీజేపీ కి ప్రజలు పట్టం కట్టారు. ఎలాంటి అవినీతి లేకుండా మోడి పాలన సాగిస్తున్నారు. భారత్ లో కరోనా వస్తే తీవ్ర నష్టం జరుగుతుంది అని ప్రపంచం మొత్తం విశ్లేషకులు చెప్పేవారు. సమర్దవంతంగా కరోనాను మోదీ ఆధ్వర్యంలో ఎదుర్కోన్నాం.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
సమర్దవంతమైన వ్యాక్సిన్ ను తయారు చేశాం. స్వయం గా ప్రధాని వచ్చి వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను సందర్శించి వారికి ధైర్యం ఇచ్చారు. మాస్క్ లు, పీపీఈ కిట్లు కూడా ఇన్పోర్ట్ చేసుకున్నాం. ఆ తరువాత ఇప్పుడు అన్ని మన దేశంలో తయారు చేసుకుంటున్నాం. మోడీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదు. ఏదో ఓ రకంగా మోడీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్చిన్నం అవుతుంది. ఈశాన్య రాష్ట్రాల లో కనీసం రోడ్లు కూడా ఉండేవి కావు. పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాష్ట్రంలో 32జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశాం. భారతీయులు అంటే గతంలో అవమానించే వారు.. ఇప్పుడు భారత పాస్పోర్ట్ ఉంటే పెద్దఎత్తున గౌరవం దక్కుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం లో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు జరిగేవి. ఇప్పుడు ఎక్కడా బాంబు పేలుళ్లు లేవు. 2023లో మొదటి సారి కాశ్మీర్ లో 2కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ఆర్టికల్ 370రద్దు చేసి శాంతి నెలకొల్పాం. గతం లో జమ్మూ కాశ్మీర్ లో జంగిల్ రాజ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ కుటుంబం అహంకారం తో సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. దేశం లో ఏ ఒక్క నాయకుడు అలా మాట్లాడరు.’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
- Tags
- bjp
- breaing news
- BRS
- kcr
- Kishan Reddy
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!