Congress : ఆరు గ్యారెంటీలు అద్భుతం.. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు చాలా బాగుతున్నాయని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నది మంచి ఆలోచన అని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబునిచ్చారు. సోమవారం నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వీ హబ్ లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, బెంగళూరు కాన్సూలేట్ జనరల్ హిలరి మెక్ గెచ్చి రాష్ల్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం గురించి వారికి మంత్రి వివరించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఆయా కోర్సుల్లో శిక్షణ అందించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూల ప్రదేశమని అంగీకరించిన ఫిలిప్ గ్రీన్…. రాష్ట్రానికి తమ దేశం నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడానికి చొరువ తీసుకుంటామని స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులపై అస్ట్రేలియా బృందంతో మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు. వ్యవసాయ క్లస్టర్ల గురించి వివరించారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా విధానాల రూపకల్పన జరుగుతుందని, దళారి వ్యవస్థ లేకుండా నేరుగా రైతులకే ప్రయోజనం కలిగేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, దాని ఆధారిత రంగాలను మరింత లాభసాటిగా మార్చేందుకు యూనివర్సిటీలు, నిపుణులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారని చెప్పారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
వీ-హబ్ తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్యం
వీ-హబ్ తో అస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది. సోమవారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిన్ గ్రీన్ మధ్య జరిగిన సమావేశంలో ఈ భాగస్వామ్యం ఒప్పందం కుదిరింది. భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా మహిళలకు, అణగారిన వర్గాలకు, ఎల్జీబీటీఐఈ సమూహానికి ఎంటర్ ప్రేన్యూయర్ షిప్ లో స్టార్ట్ - ఎక్స్ పేరిట 13 వారాల పాటు వీ-హబ్ ప్రీ-ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… మహిళా సాధాకారత పునాదుల మీద తెలంగాణ వృద్ధి ఉంటుందని, దాన్ని తాము విశ్వసిస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500 కే ఎల్పీజీ సిలిండర్ కార్యక్రమం వంటివి చేపట్టామని వివరించారు. మహిళలకు సంబంధించి క్షత్రస్థాయి అంశాలు పరిష్కరించకపోతే వారు ప్రపంచంతో పోటీ పడడంలో అవరోధాలు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వీ-హబ్ తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్యం పట్ల ఆనందంగా ఉందని అన్నారు. అస్ట్రేలియా ప్రభుత్వం అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, వీ-హబ్ సీఈవో దీప్తి రావుల, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!