ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల కన్నా చిన్న సినిమాలకే ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు.. బలగం లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. నిన్న సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా కూడా ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో సినిమా రోజు రోజుకు అంచనాలను పెంచేస్తుంది.. ఆ సినిమానే మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా.. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం హీరోగా నటిస్తున్న చిత్రం ‘మస్త్ షేడ్స్…
ప్రేమ పేరుతో నమ్మించి.. శారీరకంగా అనుభవించి పెళ్లికి నిరాకరించడమే కాకుండా స్లో పాయిజన్ ద్వారా చంపాలని చూశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కి చెందిన మాధురి, శేఖర్‌లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఒకేరోజు రెండుసార్లు భేటీకావడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలపాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ సమావేశమయ్యారు.
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మమ్మరం చేశారు. చెన్నైలో నిందితుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది.
జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో బస చేశారు. ఇక, చంపయ్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో పది మందికి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది.
బీసీల జీవిత కాల వాంఛ అయిన కుల గణనకు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్‌కి ధన్యవాదాలు తెలిపారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మేమెంతో మాకంత అన్న నినాదాన్ని నిజం చేయడంలో కుల గణన తొలి అడుగు అని ఆయన అన్నారు. తొలి అడుగుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్కకి, తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు…
రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే…