విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్) అమ్మకానికి ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సేలం స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ అల్లాయ్ స్టీల్ ప్లాంట్, భద్రావతిలోని విశ్వేశ్వరాయ స్టీల్ ప్లాంట్‌లలో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపధ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయానికి సంబంధించి కొనుగోలుదార్ల నుంచి ఈవోఐ జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకున్నదా అని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన…
స్వార్థ రాజకీయ ప్రయోజనాల సాధన కోసం పార్లమెంటరీ సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజనకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఏనాటికీ క్షమించబోరని వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పొందలేకపోవడానికి కారణం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదమే కారణమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. నేడు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. పలు శాఖలకు సంబంధించిన అన్యువల్ రిపోర్ట్స్‌ను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం .. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్ ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలోకి అడుగులు వెస్తు్ంది. నేడు సుందర్‌గఢ్ జిల్లా నుంచి రాహుల్ గాంధీ ఒడిశాలోకి అడుగు పెట్టనున్నారు.
హరీశ్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్లు నటించి వేరే వాళ్ల చావుకు కారణం కాలేదని, పోసుకుని చచ్చిపోతా అని నాటకాలు ఆడలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కూడా వాళ్ళు అందరూ బ్లాక్ మైలర్స్ గా ఉన్నారని, ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తదన్నారు. తెలంగాణ రావడానికి మూల కారణం… ఆల్ పార్టీ లో కేంద్రాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే. అవిషయం…
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చేస్తోంది. భక్తులను తరలించేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు తెలిపింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా, ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె హాజరుకావడం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేయగా, తదుపరి తేదీ వరకు మధ్యంతర ఉపశమనం మంజూరు…
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థుడని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం జరిగిన మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహణపై ముఖ్యమంత్రి బాంబు పేల్చారని, ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యారని అన్నారు. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని, రైతుబంధు ఎకరాకు రూ.15 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన…
భువనగిరి ఎస్సీ సంక్షేమ హాస్టల్లో శనివారం రాత్రి 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు హాస్టల్ గదిలో మృతి చెందిన ఘటనలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భువనగిరి పోలీసులు హాస్టల్ వార్డెన్ శైలజ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రతిభ, ఆటోడ్రైవర్ ఆంజనేయులు, వంటవాళ్లు సుజాత, సులోచన, హాస్టల్ ట్యూషన్ టీచర్ భువనేశ్వరిపై కేసు నమోదు చేశారు. హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది కౌన్సెలింగ్ చేయడంతో తమ కుమార్తెలు ఆత్మహత్యాయత్నానికి…
బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాల్కసుమన్ వ్యాఖ్యలను జనం ఈసడించుకున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడారు.. దాంతో ప్రజలు సరియైన గుణపాఠం చెప్పారు.అయినా బుద్దిరాలేదని, ఒళ్లు దగ్గర పెట్టుకోండి..సరిగా మాట్లాడండీ అని ఆయన హితవు పలికారు.…