Software Engineer: ప్రేమ పేరుతో నమ్మించి.. శారీరకంగా అనుభవించి పెళ్లికి నిరాకరించడమే కాకుండా స్లో పాయిజన్ ద్వారా చంపాలని చూశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కి చెందిన మాధురి, శేఖర్‌లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.. గత ఆరేళ్ల నుంచి వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె అడ్డం తొలగించుకోవాలని ప్రయత్నించాడు. ఈ ఆరేళ్లలో రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడని తెలిపారు బంధువులు.
Read Also: Anupama Parameswaran : స్టేజ్ పైనే డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన అనుపమ.. వామ్మో ఇలా చేసిందేంటి?
విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లాడ్జిలోకి వెళ్లి మాయమాటలు చెప్పి పాయిజన్ ఇచ్చాడు. వారం రోజుల తర్వాత ఆ యువతి ప్రాణాలతో పోరాడుతూ చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కూతురి మృతితో తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆ యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.