ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల కన్నా చిన్న సినిమాలకే ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు.. బలగం లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. నిన్న సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా కూడా ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో సినిమా రోజు రోజుకు అంచనాలను పెంచేస్తుంది.. ఆ సినిమానే మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా..
కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం హీరోగా నటిస్తున్న చిత్రం ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంది.. ఆ సినిమా సరికొత్త కథతో రాబోతుంది.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. తాజాగా ‘హలో అమ్మాయి’ అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ రాశారు.. టి సంజీవ్ అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు, సిద్ శ్రీరామ్ గానంతో ఈ పాటకే అందం వచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రం మొత్తం హీరో తన ప్రేయసి చుట్టు తిరుగుతూ తన ప్రేమ తాలూకా భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు, హీరోయిన్ పాత్రలో వైశాలి రాజ్ నటించారు..
ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ చిత్రాన్ని తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వం వహించగా.. భవాని కాసుల, అరీం రెడ్డి అండ్ ప్రశాంతి వి ప్రొడ్యూస్ చేశారు.. పులిమేర 2 చిత్రం ద్వారా వంశీ నందిపాటికి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ గా మంచి పేరు వచ్చింది, ఈ వంశీ నందిపాటి ఈ మస్తు షేడ్స్ ఉన్నాయి రా చిత్రాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 23న విడుదల చేయబోతున్నారు..