Jagga Reddy : అధికారంలో ఉన్నా… లేకపోయినా నేను బలమైన వ్యక్తిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలో ఉన్నా… లేకపోయినా తాను బలమైన వ్యక్తిని అని వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్‌లో ఇవాళ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ పాత్రికేయులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ…… ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు.. మంత్రులూ అలాగే ఉంటారని… ఇందులో ఎలాంటి అనుమానం లేదని జగ్గారెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా… తాము మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మా వ్యూహాలు మాకు ఉన్నాయని ఆయన తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ గేమ్స్ ఆడే ప్రయత్నం చేస్తున్నాయని… కానీ మా గేమ్స్ ముందు వారు ఎంత? అన్నారు జగ్గారెడ్డి.
తన టైమ్ బాగాలేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో ఓడిపోయానన్నారు. రాజకీయ నాయకుడు అంటే ఓసారి గెలవవచ్చు… మరోసారి ఓడిపోవచ్చునన్నారు. అయితే అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేగా గెలవకపోయినా అధికార కార్యక్రమానికి తనను పిలవాలని తాను చెప్పడం వెనుక ఇది కేసీఆర్ నేర్పిన విద్యయే అన్నారు. తాను మరో 40 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానన్నారు జగ్గారెడ్డి.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
తాను గతంలో హరీశ్ రావుతో రాజకీయంగా పోరాడానని… అదే సమయంలో అభివృద్ధి కోసం ఆయనను కలిశానన్నారు. రాజకీయం వేరు… అభివృద్ధి వేరు అన్నారు. హరీశ్ రావు తనను రాజకీయంగా తొక్కేయాలని చూశారని ఆరోపించారు. వ్యతిరేకత వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందని తెలిపారు. తాము కలిసికట్టుగా పనిచేసి మెదక్ లోక్ సభ స్థానాన్ని గెలుచుకుంటామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే బీజేపీ, బీఆర్ఎస్ కోరిక ఫెయిల్ అవుతుందని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా తొలగించాలని తాను డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని… కానీ అది ముగిసిపోయిన ఎపిసోడ్ అన్నారు. తాను కాంగ్రెస్ లైన్‌లో వెళతానన్నారు. తాను రేవంత్ రెడ్డిపై మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ తనకు ఓ మాట చెప్పారని… మనం అధికారంలోకి రాబోతున్నాం… ఎవరినీ ఏమీ అనవద్దని సూచించారని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తను కాబట్టి మా పార్టీ నేత చెప్పింది విన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ బీజేపీలో ఉండదన్నారు.
ఆనాటి నుంచి తాను రేవంత్ రెడ్డిని ఏమీ అనలేదని తెలిపారు. అయినా అది మా కాంగ్రెస్ ఇంటి పంచాయతీ అని పేర్కొన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి హామీలు అమలు చేస్తూ మంచి పాలన అందిస్తామన్నారు. మా పార్టీలో మేం కొట్టుకుంటాం… తిట్టుకుంటాం… మా పైకి ఎవరైనా వస్తే మేమంతా కలిసి తిరగబడతామన్నారు. ఇదే కాంగ్రెస్ పద్ధతి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!