బీజేపీతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు అని కేసీఆర్ అన్నారని, గతంలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేసిన యత్నాలను కేసీఆర్ ఉదాహరించారన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఓ సీనియర్ కాంగ్రెస్ నేత 20 ఎమ్మెల్యేలను తీసుకొస్తా ఆంటే వారించా అని కేసీఆర్ ఆ రోజు చెప్పారన్నారు. రేవంత్ మాత్రం ప్రతీ సభ లో కేసీఆర్ తన ప్రభుత్వానికి కూలుస్తారన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని, ప్రభుత్వం రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. జానారెడ్డి , జైపాల్ రెడ్డి లు అనుభవజ్ఞులు .వారి గురించి కూడా చులకన చేసి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి కి పాలన అనుభవం శూన్యమని, లాగులో తొండలు అని ఎదో భాష మాట్లాడుతున్నారన్నారు పొన్నాల లక్ష్మయ్య. పాలన చేయమంటే పనికి రాని మాటలు చెబుతున్నాడని, దేవుండ్ల మీద ప్రమాణం చేయడం కాదు ,గతం లో చెప్పిన డెడ్ లైన్ల పై నిలబడ్డాడా అని ఆయన ప్రశ్నించారు. పంట నష్టం మీద ఎపుడైనా ఈ సీఎం స్పందించారా అని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం నిజాలు దాస్తోందని, ఆయన గురించి మాట్లాడడమే నాకు సిగ్గు అనిపిస్తుందన్నారు పొన్నాల లక్ష్మయ్య.