మోడీ ఆరోపణలు చూస్తుంటే ఎంత భయంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. . కాంగ్రెస్ మేనిఫెస్టో తెలిసి మాట్లాడుతూ ఉన్నారా..చూడకుండా మాట్లాడుతున్నారా ..? అని ఆయన ప్రశ్నించారు. కార్పోరేట్ మిత్రులకు రుణాలు మాఫీ చేశారు కానీ రైతుల కోసం మాత్రం మాఫీ చేయలేదని, . హిందు..ముస్లిం గురించి మాట్లాడతారా ఛీ.. యువకులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా.. హిందు మహిళల తాళిబొట్టు ముస్లిం లకు ఇస్తారు అని మోడీ అనడం చూస్తుంటే ఏడవలా.. నవ్వాలో అర్థం కావడం లేదని ఆమె విమర్శించారు. మీరు కట్టిన మాంగళ్యం విలువ తెలియదని, మీరు మాంగళ్యం కట్టిన ఆడబిడ్డ ఎక్కడో అమాయకంగా బతుకుతుందన్నారు. మీరు కట్టిన మంగళ సూత్రం ఉరి తాడు అయ్యిందని, మోడీ క్షమాపణ చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి మోడీపై.. ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయి అని అంటున్నారు.. మోడీ వ్యాక్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి.. లేదంటే ఎన్నికల కమిషన్ పని తీరు పై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.. కేసీఆర్.. కేటీఆర్.. వడదెబ్బ తగిలి మట్లాడుతున్నారు.. కేసీఆర్ కి ఎక్కువై మాట్లాడుతున్నాడు.. కేసీఆర్.. బీజేపీ… కాంగ్రెస్ బాగుండాలి అని కోరుకుంటారా..? కూలిపోతుంది అనే అంటారు.. నేను రాజ్యసభ ఎంపీ గా ఉన్నా.. లోక్ సభ ఎన్నికల్లో నిలబడటానికి నేను రెడీ… పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుతాం.. ఖమ్మం కాంగ్రెస్ కి కంచుకోట’ అని ఆమె అన్నారు.