CM Revanth Reddy : నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేక అభిమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేక అభిమానమన్నారు. మూతపడిన చక్కెర కర్మాగారం తెరిచేందుకు విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17లోగా చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వందరోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్ ది.. అందుకే కేసీఆర్ ను రాజకీయంగా వందమీటర్ల గోతి తీసి పాతిపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’నిజామాబాద్ రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తామని ఇక్కడి రైతులు నిరూపించారు.. బండిని, గుండును నమ్మరని గత ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చారు… స్పైసెస్ బోర్డును తెచ్చి అదే పసుపు బోర్డు అని చెబుతున్నారు… స్పైసెస్ బోర్డుకు పసుపు బోర్డుకు తేడా తెలియదా మా నిజామాబాద్ రైతులకు? హర్యానా రైతుల తరువాత ఆర్మూర్, నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉంది.. ప్రభుత్వం మెడలు వంచి వారి సమస్యలను పరిష్కరించుకునే సత్తా రైతులకు ఉంది.. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది… జీవన్ రెడ్డి ని గెలిపిస్తే… సోనియమ్మ, రాహుల్ గాంధీని ఒప్పించి.. జీవన్ అన్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా చేసే బాధ్యత నాది… కేంద్ర మంత్రిగా పసుపుబోర్డు తీసుకొచ్చి జీవన్ అన్న నిజామాబాద్ రైతుల కోరిక తీరుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచిపెడతారని ప్రధాని మాట్లాడుతున్నారు.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రధాని మోదీ..మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.. ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుంది… ఓటమి భయంతోనే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి రాజకీయ లబ్ది పొందాలని చూడటం మంచిదా?
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలి… కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి కుట్రలు చేయడం దేశానికి మంచిది కాదు… రాముడు మీకే కాదు… మాకూ దేవుడే.. నేను హిందువునని గర్విస్తా.. ఇతర మతాలను గౌరవిస్తా… బాసర సరస్వతీ దేవి సాక్షిగా చెబుతున్నా… పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది.. జీవన్ రెడ్డిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి… ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపండి… జీవన్ అన్నకు వేసే ప్రతీ ఓటు మీ రేవంతన్నకు వేసినట్లే..’ అని సీఎం రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!