మోడీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగం మారుస్తారని ఖర్గే అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏపై కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. ముస్లిం, పాకిస్థాన్ వంటి దేశాల్లో హిందువులను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, వారిని ఆదుకునేందుకే సీఏఏ అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ దీనిపై చిదంబరం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాకిస్థాన్ ఒక మతపరమైన రాజ్యంగా కొనసాగుతోందని, ముస్లిం దేశాల్లోలేని భద్రత భారత దేశంలో మైనార్టీ వర్గాలకు ఉందన్నారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని, దీనివల్ల ఎవరికీ నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు ఎంపీ లక్ష్మణ్.
అంతేకాకుండా.’ఎన్నికల్లో ఓట్ల కోసం ముస్లింలను రెచ్చగొట్టి, అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. చిదంబరం నరనరాన హిందువులపై వ్యతిరేక భావన ఉంది. సీఏఏను ఎవ్వరూ రద్దు చేయలేరు. దీనిపై చిదంబరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్ తీరు. వాళ్ళు కూడా రాజ్యాంగంపై మాట్లాడుతున్నారు. ప్రధానిని అవమానించిన పార్టీ కాంగ్రెస్. నెహ్రూ కుటుంబం తప్ప ఎవరూ పాలించొద్దనే భావనలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వందసార్లు రాజ్యాంగాన్ని సవరించింది. ఇందిరా గాంధీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరించారు. ఒక్క కుటుంబం చేతిలో కాంగ్రెస్ బందీ అయిపోయింది. ఇండియా కూటమి రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి అని చెప్పలేక పోతున్నాయి. ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ కాంగ్రెస్ కు 40సీట్లు రావని చెప్పింది. రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయింది.. భవిష్యత్ లో కాంగ్రెస్ పని కూడా అంతే. 40 సీట్లు కూడా రాని కాంగ్రెస్ కు రావు.. వాళ్ళు రాజ్యాంగంపై మాట్లాడుతున్నారు. ఎన్ని వేధింపులకి గురిచేసినా.. గెలుపు బీజేపీదే’ అని ఆయన వ్యాఖ్యానించారు.