ఈ మధ్య కొన్ని సినిమాలు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఈ సినిమా కామెడీ మూవీగా వచ్చింది. అందరిని బాగానే ఆకట్టుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఈనెల 28 న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.. తమిళంతో పాటుగా తెలుగులో…
గత ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయింది.. కార్ఖానా నుంచి ఇక కారు వాపసు రాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కారు ఇక తుకానికి పోవాల్సిందేనని ఆయన అన్నారు. గద్దరన్నను అవమానించిన ఉసురు తగిలి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందని, పేదల చెమట గిట్టని కేసీఆర్… బస్సు యాత్ర మొదలు పెట్టిండన్నారు రేవంత్ రెడ్డి. బస్సు యాత్ర కాదు.. ఆయన మోకాళ్ల యాత్ర చేపట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని, సినిమా…
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలపై 12 మంది సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. 2022 నవంబరులో గుడిలో జరిపిన దాడుల్లో, విజిలెన్స్ అధికారులు ఆలయంలోని వివిధ విభాగాలలో అవకతవకలను గుర్తించారు , అవినీతికి పాల్పడిన , విధులను నిర్లక్ష్యం చేసిన కొంతమంది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ నివేదికను పంపారు.ఈ సిఫార్సు మేరకు ఆలయ అధికారులు ముగ్గురు ఏఈవోలు, నలుగురు సూపర్‌వైజర్లు,…
ఇటీవల ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో, తాజా బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రకటనలకు ధీటుగా స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురి అయింది. వారి అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టారు. అవరోధాలు అన్నిటిని అధిగమించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే 30 ఏళ్లకు రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తూలపూర్‌లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షో, కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ, ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చూస్తే గల్లపెట్టల్లో పైసలు లేవని, ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100…
నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామన్నారు, ఇది బీజేపీ స్టాండ్ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో భారతీయులను అభద్రతకు గురి చేసేలా ఉందని, హాల్ సెల్ గా దేశాన్ని ముస్లిం లకు అప్పగిస్తాం అంటోంది కాంగ్రెస్ అని వెల్లడించారు. ముస్లిం ల రిజర్వేషన్లు తీసి ఎస్సి ఎస్టీలకు ఇస్తామని…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.. గత ఏడాది చివరన సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు కల్కి 2898 AD, రాజా సాబ్ ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక సలార్ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.. ఇక ఈ సినిమాతో పాటుగా…
బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్పల్లి ఏసిపి వివరాలు వెల్లడించారు. భువనగిరి జిల్లా నాగయ్యపల్లి తండాకు చెందిన బానోతు భాస్కర్(21) బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ, మద్యానికి బానిసై డబ్బుల సంపాదన కోసం చోరీల బాట పట్టాడు. బంగారం దుకాణంలోకి కస్టమర్ లాగా ప్రవేశించి పలు చైన్లను…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల విధానాలకు సంబంధించి గత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు ఆరోపణలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తీవ్రంగా విమర్శించారు. రిజర్వేషన్ల వ్యవస్థపై మోడీకి అవగాహన లేక కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం వర్గాలకు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 4% రిజర్వేషన్లు అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు.…
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రెండు మూడు రోజులుగా మాజీ ప్రధాని పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నరేంద్రమోడీ వ్యాఖ్యలు సరికాదు. నరేంద్రమోడీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె…