Bhatti Vikramarka : విద్యుత్ రంగంపై మాజీ సీఎం కేసీఆర్‌వి అవాస్తవ ప్రకటనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో, తాజా బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రకటనలకు ధీటుగా స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురి అయింది. వారి అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టారు. అవరోధాలు అన్నిటిని అధిగమించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే 30 ఏళ్లకు రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు సాగుతున్నాము. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలు వాస్తవాలపై చర్చకు సిద్ధం అని డిప్యూటీ సీఎం, విద్యుత్తు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. ఈ మేరకు గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
దీర్ఘకాలిక అవసరాల కోసం చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి విద్యుత్తు కొనుగోలు చేశామని మాజీ సీఎం కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదు. 6 మే 2017 నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు డిసెంబర్ 2014లో ఒప్పందం చేసుకున్నారు. కానీ తెలంగాణ డిస్కమ్ లకు 300 నుంచి 400 మెగా ఓట్ల కన్నా ఎక్కువ సరఫరా చేయలేదు. పైగా ఏప్రిల్ 2022 నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా ఆపేశారు. చత్తీస్గడ్ రాష్ట్రం తో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయించడంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మేము యూనిట్కు 13 రూపాయలు చొప్పున వెచ్చించి కొనుగోలు చేసినట్టు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు మేము కొనుగోలు చేసింది యూనిట్ కు రూ 3.90 మాత్రమే అని కేసీఆర్ అంటున్నారు. నాటి పాలకులు విద్యుత్ యూనిట్కు రూ. 20 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. వాస్తవ మా? కాదా? ఇది రికార్డుల్లో నమోదు చేయబడి ఉంది. చర్చకు నేను సిద్ధం అని డిప్యూటీ సీఎం ప్రతి సవాల్ విసిరారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఎన్ టి పి సి ఒక్కో యూనిట్ 15 రూపాయలు చొప్పున చెల్లిస్తే విద్యుత్ సరఫరా చేస్తానని అన్నది. అందుకు మేము ఒప్పుకోలేదని మాజీ సీఎం ప్రకటించడం వాస్తవ దూరం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ టి పి సి యూనిట్ కు రూ.5.60 చొప్పున సగటున ధర నిర్ణయించి 1600 మెగావాట్ల విద్యుత్తును తెలంగాణ డిస్కమ్ లకు సరఫరా చేసింది. తాజా కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కు 13 రూపాయల కన్నా ఎక్కువే చెల్లించి కొనుగోలు చేస్తుందని బిఆర్ఎస్ అధ్యక్షుడు ఆరోపించారు. డిసెంబర్ 2023 నుంచి తెలంగాణ డిస్కమ్స్ కొనుగోలు చేసిన విద్యుత్తు ఒక్కో యూనిట్ సగటు ధర 5.34 మాత్రమే. మేము యూనిట్ కు 13 రూపాయలు చొప్పున చెల్లించి కొనుగోలు చేశామనేది పచ్చి అబద్ధం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 7700 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం 19 ,000మెగావాట్ల విద్యుత్ ఉంది. అయినా కెసిఆర్ పక్కకు పోగానే కరెంటు కోతలు మొదలయ్యాయి. ఇది రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటన. పూర్తి అవాస్తవాలతో కూడిన ప్రకటన అని డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో స్థాపిత థర్మల్ విద్యుత్తు సామర్థ్యం 2080 మెగావాట్లు మాత్రమే. ఇందులో 1000 మెగావాట్లు ఛత్తీస్గడ్ నుంచి సేకరించారు. ఇది ఏప్రిల్ 20 22 లోనే విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. మిగిలిన 10 80 మెగావాట్ల ధర్మల్ కెపాసిటీని భద్రాద్రి (Btps) లో సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించి అధిక వ్యయంతో నిర్మించారు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని థర్మల్ , హైడల్ ప్రాజెక్టులు గత ప్రభుత్వాలచే 2014 కి ముందే ప్రారంభించారు.
డిసెంబర్ 20 23 నుంచి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక విద్యుత్ సరఫరాను చేసింది. తెలంగాణ డిస్కములు రాష్ట్రంలో అత్యధికంగా 15, 623 మెగా వాట్లు , 308.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ను సాధించాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా రికార్డ్ స్థాయిలో 4093 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను తట్టుకొని నిలబడ్డాయి. డిసెంబర్ 23 నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించిన సందర్భమే లేదు. గత పది ఏళ్లలో నాసిరకం నాణ్యతలేని లైన్లు ట్రాన్స్ఫార్మర్లు , ఇతర ఆస్తుల నిర్వహణ సాంకేతిక లోపాల కారణంగా తీవ్ర అంతరాయాలకు దారి తీసింది. వాటన్నిటిని మేము గాడిలో పెట్టే పనిలో ఉన్నాము.
హైదరాబాదును పవర్ ఐలాండ్ గా మార్చామని మాజీ సీఎం ప్రకటించడం వాస్తవ దూరమైనది. 20 12 లో గ్రిడ్ కుప్పకూలిన తర్వాత హైదరాబాద్ పవర్ ఐలాండ్ పథకం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ పవర్ ఐలాండ్ గా రూపు దిద్దుకుంది. దేశంలోని 20 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లో ఇలాంటి పవర్ ఐలాండ్ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చాము. విద్యుత్కు ప్రాధాన్యత ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరోపించడం దొంగ దొంగ అన్నట్టు ఉంది. గత ప్రభుత్వ పాపాల మూలంగా తెలంగాణ డిస్కంలు వేలకోట్లలో అప్పుల్లో కూరుకుపోయాయి. 2 జూన్ 2014 రాష్ట్ర ఆవిర్భావ సమయానికి డిస్కం ల నష్టాలు రూ. 12, 186 కోట్లు కాగా మీ పదేళ్ల పాలన పూర్తయ్యేసరికి 31-3-2023 నాటికి ఆ నష్టాల భారం రూ.62 ,461 కోట్లకు చేరింది. ఈ అంకెలు ఈరోజు నమోదు చేసినవి కావు. వాస్తవాలు చెరిపేస్తే చెరిగేవి కావు. విద్యురంగంపై చర్చకు తాను సిద్ధమని డిప్యూటీ సీఎం సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?