మే 1న ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవాళ ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువై వడగాల్పులు వీస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విధుల్లో ఉన్న సచివాలయ, రెవిన్యూ సిబ్బందితో మే 1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేయించాలని ఆయన కోరారు. సిబ్బంది, నగదు కొరత అనే సాకులు చెప్పకుండా ఇప్పటినుండే తగు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో విధుల్లో ఉన్న సచివాలయ, రెవిన్యూ సిబ్బందిలతో మే 1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేయించాలన్నారు. సిబ్బంది, నగదు కొరత అనే సాకులు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటినుంచే తగు చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
కాగా ఎన్డీఏ తోనే వైసీపీ కాపురమంటూ మనసులో మర్మాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. 1200 రోజులుగా విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోని జగన్‌కు ఇవాళ ఉక్కు కార్మికుల ఓట్లు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందన్న విషయం తెలియదనటం సీఎం పదవికే అవమానమన్నారు. జగన్, చంద్రబాబు .. బీజేపీ తానులో ముక్కలేనని.. వైసీపీ, టీడీపీ లలో ఎవరిని గెలిపించినా బీజేపీ కుంపటి ప్రజల నెత్తిన పెట్టడం ఖాయమని రామకృష్ణ వ్యాఖ్యానించారు..