నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామన్నారు, ఇది బీజేపీ స్టాండ్ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో భారతీయులను అభద్రతకు గురి చేసేలా ఉందని, హాల్ సెల్ గా దేశాన్ని ముస్లిం లకు అప్పగిస్తాం అంటోంది కాంగ్రెస్ అని వెల్లడించారు. ముస్లిం ల రిజర్వేషన్లు తీసి ఎస్సి ఎస్టీలకు ఇస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. ముస్లిం లకు రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని, ఆరు గ్యారంటీ ల గురించి చెప్పమంటే… రేవంత్ రెడ్డి తేదీలు చెప్పుతూ వెళ్తున్నారన్నారు.
గ్యారెంటీ ల దృష్టి మరల్చేందుకు చార్జీ షీట్ పేరుతో రేవంత్ రెడ్డి కొత్త డ్రామా అని ఆయన అన్నారు. మోడీ హయాంలో ప్రపంచం సెక్యులర్ గా మారుతోందని, కాంగ్రెస్ డిశ్చార్జి అయ్యింది.. ఇంకేం ఛార్జి షీట్ అని ఆయన అన్నారు. బీజేపీ జాతీయవాద పార్టీ.. కాంగ్రెస్ ది పాకిస్థాన్ అజెండా అని ఆయన విమర్శించారు. టెర్రరిజం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ అని, భారత్ ను తాలిబాన్ కు అడ్డాగా మార్చే పార్టీ కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే క్రైసిస్ అని, ముందు రాహుల్ గాంధీ నీ ఛార్జ్ చెయ్యండి.. ఆ తర్వాత ఛార్జి షీట్ లు విడుదల చేయండన్నారు. కాంగ్రెస్ కు జులై 14 న సంక్షోభం ముప్పు ఉందన్నారు.