Robbery : దృష్టి మరల్చి బంగారు దుకాణాల్లో చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్‌పల్లి ఏసిపి వివరాలు వెల్లడించారు. భువనగిరి జిల్లా నాగయ్యపల్లి తండాకు చెందిన బానోతు భాస్కర్(21) బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ, మద్యానికి బానిసై డబ్బుల సంపాదన కోసం చోరీల బాట పట్టాడు. బంగారం దుకాణంలోకి కస్టమర్ లాగా ప్రవేశించి పలు చైన్లను చూపించమని సేల్స్ పర్సన్ కు చెప్పి, వారు తమ పనిలో నిమగ్నం అయ్యి ఉండగా అదను చూసుకొని చైన్ చోరీ చేస్తాడు.
Also Read
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్‌నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
ఈ విధంగా కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు దుకాణాలు, పంజాగుట్ట, మహంకాళి, నిర్మల్, మిర్యాలగూడ, మక్తల్, చైతన్యపురి స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డాడు. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని లలిత జ్యువలరీ షో రూం లో ఈ నెల 3వ తేదీన చోరికి పాల్పడగా, ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ రోజు కె.పి.హెచ్.బి కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా, పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. నిందితుడి నుండి 151.83 గ్రాముల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఏసిపి తెలిపారు .
తాజావార్తలు
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్‌నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!