కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తూలపూర్‌లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షో, కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ, ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చూస్తే గల్లపెట్టల్లో పైసలు లేవని, ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేశామని ఆయన వెల్లడించారు. ఆగస్ట్ 15 లోపు రైతులకు రెండు లక్షల ఋణ మాఫీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి తప్పకుండా డబల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అయోధ్య లో ఇంకా రామునికి పట్టాభిషేకం జరగక ముందే అందరికీ అక్షింతలు ముట్టినయ అని బండి సంజయ్ అడుగుతున్నాడని, అక్షింతలు ఎప్పుడు వేస్తారు అమ్మ అంటూ మహిళలకు ప్రశ్నించారు.
అధికారం పోయాకా కేసీఆర్ కు ప్రజలు గుర్తొచ్చారని, మళ్ళీ అధికారంలోకి వస్తా అని కేసీఆర్ మాట్లాడుతున్నాడు వచ్చి ఏం చేస్తావ్ ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా అవినీతి చేస్తావా అని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లో దేశానికి, తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలన్నారు మంత్రి పొన్న ప్రభాకర్ రెడ్డి. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 1200 కు పెంచిం దన్నా రు. ఉప్పులు, పప్పులు నిత్యావసరాల ధరలు భారీగా పెంచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర అందిస్తున్నామన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు పొన్న ప్రభాకర్.