బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల కేసులో ఇద్దరు ఆయుధాల సరఫరాదారుల్లో ఒకరు ఈరోజు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26న పంజాబ్‌లో అరెస్టయిన అనూజ్ తపన్ (32) ఉదయం 11 గంటలకు పోలీసు లాకప్‌కు అనుబంధంగా ఉన్న టాయిలెట్‌కి వెళ్లి ఉరివేసుకున్నట్లు తెలిసింది.
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఅర్ఎస్, బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రాజకీయంగా కడియం కావ్య ఎదురుకోలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కడియం కావ్యను…
పేదలకు సాయం చేస్తుంటే పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారని.. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. ఏలూరులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మన రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులు కోటీ 40 లక్షలు ఉన్నారని.. పేదలందరికీ పథకాలు అందాలా వద్దా అంటూ ముఖ్యమంత్రి అన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు..ఈ పొలిటికల్ థ్రిల్లర్ అప్పుడెప్పుడో 2021లో లాంఛ్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నారు. మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు.. ఇప్పటికి చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని గత కొన్ని రోజులుగా మేకర్స్ చెబుతున్నారు.. సాంగ్ తర్వాత మరో అప్డేట్ ను ప్రకటించలేదు.. తాజాగా రామ్ చరణ్ చైన్నైకి వెళ్లినట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని రాజీవ్…
ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ మద్యం, డ్రగ్స్, నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. అక్కడక్కడా నగదుతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
తెలంగాణ భవన్‌లో కార్మికులను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన బ్రతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మర్చిపోయి కూడా లంగలకు, దొంగలకు ఓట్లు వేయొద్దని ఆయన కోరారు. హృదయం లేని మనిషి ప్రధాని మోడీ అని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు 14 లక్షలు కోట్లు మాఫీ చేశాడు. ఇది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, మోడీ కార్పొరేట్ దోస్త్ లకు…
జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జన జాతర సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకే అనేక సందర్భాల్లో రాజకీయ సలహాలతొ పాటు ప్రజా సమస్యల పై పోరాట మార్గాన్ని ఇచ్చిన పెద్దలు జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. 30 సంవత్సరాల తరువాత బీజేపీ ఎవరి సహకారం లేకుండా…
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకప్పుడు కొట్టుకున్నారని.. మళ్లీ రాజకీయం గురించి కలిసిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు రావులపాలెం టు యానాం ఏటిగట్టు రోడ్డు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు.
ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇక సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునేంత వరకు స్మార్ట్ఫోన్ అనేది మన లైఫ్లో ఒక భాగమైపోయింది. ఇదిలా ఉండగా.. స్మార్ట్ఫోన్ మన పనుల్ని ఎంతలా సులభతరం చేసిందో.. మరోవైపు అది అంతే ప్రమాదకరంగా మారుతోంది. కొంతమంది ఏకంగా ఫోన్లను సిస్టం గా వాడుతారు. వాళ్లంతా ఫోన్లో కీబోర్డును ఇంస్టాల్ చేసుకొని వాడుతారు. అదే పెద్ద ప్రమాదాన్ని తెచ్చి…
నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గల్లీ నుండి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైన ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నాకు కొడుకు లేడు.. మీరే నా వారసులు అని, సీఎం వద్ద ఏ పని కావాలన్నా నేను…