జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జన జాతర సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకే అనేక సందర్భాల్లో రాజకీయ సలహాలతొ పాటు ప్రజా సమస్యల పై పోరాట మార్గాన్ని ఇచ్చిన పెద్దలు జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. 30 సంవత్సరాల తరువాత బీజేపీ ఎవరి సహకారం లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలొకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాని 10 సంవత్సరల్లో దేశ ఆస్తులను సంపదను అదానీ, అంబానీలకు అప్పగించాడని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఏక్ బార్ చార్ సౌ బార్ అంటున్నారని, 400 అనగానే చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఆలోచిస్తున్నారన్నారు.
అంతేకాకుండా.. ‘ఇప్పటికే ఇంత మంచి మెజారిటీ వచ్చిన 400 ఎందుకు అని అడుగుతున్నారు.. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి ,ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టి ఏకచక్రధిపత్యం చేయాలని చూస్తున్నారు.. దేశంలో ఎస్సి, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తొలగించాలనే కుట్ర చేస్తున్నారు నరేంద్ర మోడీ.. అందుకే బీజేపీ అభ్యర్థి అరవింద్ ని ఓడించాలి ,గుణపాఠం చెప్పాలి, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లు లేని భారత దేశాన్ని చూడాలి అన్నాడు.. ఆనాడు మండల్ కమిషన్ తెస్తే కమండల్ పేరుతొ రిజర్వేషన్ల ప్రక్రియ ఆపారు.. మొన్న రాహుల్ గాంధీ గారు కుల గణన సర్వే అంటే ఆపడానికి సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరుపున అఫిడవిట్ వేశారు.. ముందస్తుగా అప్రమత్తంగా లేకుంటే మనకు రాజ్యాంగం ఇచ్చిన ఎస్సి, ఎస్టీ, బీసీ ల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది..
రిజర్వేషన్లు ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.. తెలంగాణ నుండి ఒక్క బీజేపీ సీటు గెలిచిన అది సమాజం లో ప్రజాస్వామ్యంకే ప్రమాదం.. అందరూ ఆలోచించండి.. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కుల గణన సర్వే చేస్తుంది.. అనేక బలహీన వర్గాల అభివృద్ధికి కార్పొరేషన్ లను ఏర్పాటు చేసింది. వాళ్ళ అభ్యున్నత్తికి ప్రభుత్వం కృషి చేస్తుంది.. కాంగ్రెస్ కావాలా లేక నియంతల కింద ఫ్యూడలిస్ట్ ల కింద పనిచేద్దామా.. ఒకసారి ఆలోచించండి. జీవన్ రెడ్డి గారిని వారి అనుభవం రీత్యా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండి..’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.