Kadiyam Srihari : రాష్ట్రంలో బీఅర్ఎస్, బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఅర్ఎస్, బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రాజకీయంగా కడియం కావ్య ఎదురుకోలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కడియం కావ్యను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని కడియం శ్రీహరి అన్నారు. మూడు నెలల్లో అద్భుతం జరగబోతుందని కేసీఆర్ అంటున్నారని, రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో ఏ ఒక్కచోట బీఆర్‍ఎస్ గెలవదని ఆయన అన్నారు. కొన్నిచోట్ల మూడో స్థానం.. మరికొన్ని చోట్ల డిపాజిట్లు రాకుండా పార్టీ కనుమరుగు అవుతుందని ఆయన తెలిపారు.
ఇదే జరిగే అద్భుతం అని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. కేసీఆర్‍కు వరంగల్ అంటే కోపమని, ఈ గడ్డ మీద పోరాటాలు చేసినోళ్లు, ప్రశ్నించేటోళ్లు ఎక్కువ ఉంటారని, అందుకే ఆయనకు కోపమని చెప్పారు. కాకతీయులు ఇచ్చిన వారసత్వాన్ని కేసీఆర్ ముక్కలు చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓరుగల్లు అని గొప్పగా చెప్పుకున్న జిల్లాను ఎవరడిగారని ఆరు ముక్కలు చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‍కు తెరవెనుక సపోర్ట్ చేయడానికే వరంగల్ పార్లమెంట్‌కు సంబంధం లేని వ్యక్తిని పోటీలో పెట్టారని ఆరోపించారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?