Andhra Pradesh: ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ మద్యం, డ్రగ్స్, నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. అక్కడక్కడా నగదుతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న 70 లక్షల విలువ చేసే అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సమీపంలో పెద అవుట పల్లి వద్ద అక్రమంగా మద్యాన్ని డీసీఎంలో తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు. డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని మద్యం బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు.
Read Also: Mobile Hacking: ఫోన్లో ఇలాంటివి వాడుతున్నారా ? అయితే డేటా లీకయ్యే ఛాన్స్..తస్మాత్ జాగ్రత్త..
అయితే.. అక్రమంగా తరలిస్తున్న మద్యం, కల్తీ మద్యం.. అంటూ పలు రకాల కేసుల్లో ఇలా పట్టుబడిన లిక్కర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తారు. ఇలా పట్టుబడిన మద్యం బాటిళ్లలో కల్తీ మద్యంతో పాటు విలువైన లిక్కర్ బాటిళ్లు కూడా ఉంటాయి. అయితే.. అక్రమంగా తరలిస్తే.. అది ఎంత విలువైన మద్యం అయినా దొంగసొమ్ము కిందే లెక్క. అయితే.. ఇలా అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నవో.. బెల్టు షాపుల్లో సీజ్ చేసినవో.. ఇలా పలు కేసుల్లో చాలా రోజులుగా పేరుకుపోయిన మద్యం బాటిళ్లను ఇలా ఒకేసారి కుప్పలుగా పోసి.. అందరూ చూస్తుండగానే రోడ్డు రోలర్లతో తొక్కిస్తూ ధ్వంసం చేస్తుంటారు. ఇప్పటికే చాలా సార్లు ఉన్నతాధికారులు పలు చోట్ల ఇలాంటి ధ్వంసం కార్యక్రమాలు చేపట్టి.. ప్రజల్లో అవగాహన చేపట్టారు.