CM YS Jagan: పేదలకు సాయం చేస్తుంటే పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారని.. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. ఏలూరులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మన రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులు కోటీ 40 లక్షలు ఉన్నారని.. పేదలందరికీ పథకాలు అందాలా వద్దా అంటూ ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబును అడుగుతున్నా.. ఒక నిజమైన లీడర్ ఇంత మందికి రాష్ట్రంలో మంచి జరిగేలా చూస్తుంటే.. ఎవరు నిజమైన లీడర్ అని అడుగుతున్నామన్నారు. చరిత్రలో ఎప్పుడు జరగని జరగని విధంగా.. పిల్లల చదువు కోసం అనేక పథకాలు తీసుకువచ్చామన్నారు. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి పథకం తీసుకువచ్చింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన వంటి పథకాలు అందుబాటులో తీసుకు వచ్చామని చెప్పారు. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని మార్పులు.. ఇవన్నీ మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతున్న మార్పులని వ్యాఖ్యానించారు.
Read Also: Andhra Pradesh: ఎన్నికల వేళ.. 70 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం
అక్కా చెల్లెమ్మల సాధికారత కోసం చిన్న వడ్డీ చేయూత, అమ్మఒడి, కాపు నేస్తం, ఇళ్ల పట్టాలు, ఈబీసీ నేస్తం, అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు జరగని విధంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా స్వయం ఉపాధికి మీ బిడ్డ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ 59 నెలల కాలంలో ఎప్పుడు చూడని పథకాలు తీసుకువచ్చామని.. ప్రతి పేదవాడి బతుకులు మార్చాలని అడుగులు పడుతున్నాయన్నారు. లంచం లేకుండా, వివక్ష లేకుండా నేరుగా పెన్షన్లు ఇంటికి వస్తున్నాయంటే అది మీ బిడ్డ పాలన గొప్పతనమన్నారు. ప్రతి గ్రామంలోని రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకేలు వచ్చింది మీ బిడ్డ పాలనలోనే అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్ళు చేపట్టామన్నారు. మీ బిడ్డ పాలనకు ముందు గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా మీ చేతికి అందించారా అంటూ ప్రశ్నించారు. మంత్రి పదవుల్లో 68శాతం ఎస్సీలు, బీసీలు, వెనుకబడిన వర్గాలు ఉన్నాయని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా..రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా .. 50శాతం సీట్లలో వెనుకబడిన వర్గాలు పోటీ చేస్తున్నాయన్నారు.
Read Also: Pawan Kalyan: తోట త్రిమూర్తులు జనసేనలోకి రావట్లేదు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఇది కాదా సామాజిక న్యాయం.. వెనుకబడిన వర్గాలకు ఇంత తోడుగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా..?.. 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన మంచిపని ఏంటి అంటే ఒకటైన గుర్తు వస్తుందా..?.. మూడుసార్లు ముఖ్యమంత్రి చేశానన్న వ్యక్తి పేరు చెబితే పేదవాడికి చేసిన ఒక మంచి పనైనా గుర్తు వస్తుందా.. అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఈరోజు మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. 2014లో చంద్రబాబు సంతకం పెట్టి హామిల వర్షం కురిపించాడు.. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఇవన్నీ చేశారో లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాల మాఫీ, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఖాతాలో వేస్తా అన్నారు, కనీసం ఒక్క రూపాయి అయినా వేశారా అంటూ ప్రశ్నించారు.
చేనేత రుణమాఫీ అన్నారు చేశారా.? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు.. నిర్మించారా..? ముఖ్యమైన హామీలు అంటూ 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇచ్చిన ప్రకటన చేశారు.. ఒకటైన జరిగిందా.? అని ఆయన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటున్నారు.. కేజీ బంగారం అంటున్నారు.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గత ఎన్నికల్లో ఓటు వెయ్యని వారికి కూడా ఒకటే చెప్తున్నా.. మీరు మీ ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అనేది అడగాలన్నారు. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది.. అనేది ఆలోచన చేసి ఓటు వేయాలని సీఎం జగన్ కోరారు.