Constables: 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు
- ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి
- క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ పదిమంది కానిస్టేబుళ్లను తొలగిస్తూ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constables: పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించింది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదిమంది బెటాలియన్స్ కానిస్టేబుళ్లలను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పదిమంది కానిస్టేబుళ్లు బెటాలియన్స్ లో అశాంతికి ప్రధాన కారణమయ్యారని డీజీపీ కార్యాలయం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పదిమంది కానిస్టేబుల్ వల్లనే మిగతావాళ్లు ఆందోళనకు దిగారని పేర్కొంది కానిస్టేబుల్ ఆందోళనకు ఈ పదిమంది కారణమయ్యారని తెలిపింది. యూనిఫామ్, క్రమశిక్షణ గల ఫోర్సులో ఆందోళనలు చేయడం ఆర్టికల్ 311కు విరుద్ధమని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలు చేయడం, న్యూస్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసి ఆందోళనలను ప్రేరేపించడం ఆర్టికల్ 311కు విరుద్ధమని తెలిపారు.
Read Also: KTR : మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక.. మా బంధువులపై కుట్రలు చేస్తోంది
Also Read
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
సస్పెండ్ అయిన వారు వీరే..: 3వ బెటాలియన్ కానిస్టేబుల్ జి.రవికుమార్.. 6వ బెటాలియన్ కానిస్టేబుల్ కె.భూషణ్‌రావు.. 12వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ ఎస్‌కే షరీఫ్.. 17వ బెటాలియన్ ఏఆర్‌ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బండెల అశోక్, ఆర్.శ్రీనివాస్‌లను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!