టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు వారం రోజుల క్రితం మొదలు పెట్టిన బూతు డ్రామాకు నిన్న తెర దించారని సజ్జల వ్యాఖ్యానించారు. ఏపీలో సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డ్రామాకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. అబద్దాలు, డ్రామాలు, విధానాలను అలవోకగా మార్చడం చంద్రబాబు తెలిసిన ఏకైక విద్య అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే రాజకీయాలకు ప్రజలు, ప్రజా జీవితాలు, ప్రజల సమస్యలతో సంబంధమే ఉండదన్నారు. అయితే రాష్ట్రపతి పాలన లేదంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగిందన్నారు. రాష్ట్రపతి పాలనపై రాష్ట్రపతి ఏమన్నారో ఏమో కానీ… టీడీపీ నేతలు చెప్పాల్సింది చెప్పారు.. కక్కాల్సింది కక్కారని సజ్జల విమర్శించారు.
Read Also: మెట్రోలో కింద కూర్చున్న గర్భిణీ… ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏమన్నారు?
ఢిల్లీ పర్యటనలో అమిత్ షా అపాయింట్‌మెంట్ గురించి ప్రస్తావనే లేదని.. అసలు అమిత్ షాకు చంద్రబాబు ఏం ఫిర్యాదు చేస్తారని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు ఫిర్యాదు చేసినా అమిత్ షా రాష్ట్రంపై ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు మీడియాను ఆకర్షించగలిగారు.. కానీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని సజ్జల ఆరోపించారు. ఏపీ డ్రగ్స్‌కు రాజధానిగా ఉందని చంద్రబాబు చెప్పడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమేనన్నారు. ఈ ఒక్క విషయంలోనే చంద్రబాబుపై కేసు పెట్టి శిక్ష విధించాల్సి ఉంటుందన్నారు.
Read Also: ఏపీలో మళ్ళీ 500 దాటిన కరోనా కేసులు
ఏపీ ఇమేజ్ డామేజ్ చేస్తున్న చంద్రబాబే ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని.. ఈ ఉగ్రవాదాన్ని ఏమనాలో కూడా తమకు అర్థం కావడం లేదన్నారు. మళ్లీ అమిత్ షా ఫోన్ చేశారంటూ చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఆయనకు ఏ అమిత్ షా ఫోన్ చేశారో తమకు తెలియదని ఎద్దేవా చేశారు. గతంలో ఏ అమిత్ షాతో మాట్లాడారో.. ఇవాళ ఏ అమిత్ షాతో మాట్లాడారో చంద్రబాబుకే తెలియాలన్నారు. బూతులు తిట్టిన వాడు మాల్దీవుల్లో ఉన్నాడని.. తిట్టించిన చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో కూర్చున్నారని సజ్జల విమర్శలు చేశారు.
కేసీఆర్ కేసీఆర్ తన పార్టీని ఏపీలో పెట్టుకోవచ్చని.. దానికి ఎవరి అనుమతి అవసరం లేదని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే కాదు ఇండియాలో ఎక్కడైనా కేసీఆర్ తన పార్టీ పెట్టుకోవచ్చని సజ్జల చురకలు అంటించారు. కేసీఆర్‌కు, చంద్రబాబు ఎలాంటి బంధాలు, ఒప్పందాలు ఉన్నాయో తమకు తెలియదన్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని వాడుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకుందని సజ్జల ఆరోపించారు. సింగరేణి గనులు కూడా తెలంగాణ వాళ్లకు కలిసొచ్చాయన్నారు. హైదరాబాద్ వంటి నగరం లేకుండా రాష్ట్ర విభజన జరగడంతో ఏపీకి నష్టమేనన్నారు. విభజన వల్ల, చంద్రబాబు వల్ల మన బతుకులు అంధకారంలో పడ్డాయని సజ్జల ఆరోపించారు. అయితే జగన్ లాంటి వ్యక్తి సీఎంగా ఉండటం ఏపీ ప్రజలకు అడ్వాంటేజ్ అని అభిప్రాయపడ్డారు.