నందమూరి బాలకృష్ణ త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆహా ఓటీటీ ద్వారా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ద్వారా ఆయన హోస్ట్ అవతారంలో కనిపించనున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. అందులో యాంకర్‌గా బాలయ్య ఆకట్టుకుంటున్నాడు. ఈ ప్రోమోలో ‘నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య సిద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప సిద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు ఆపలేవు.. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాపింగ్ ఉండదు.. సై అంటే సై…. నై అంటే నై… వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింగ్ మారిపోవాలా.. కలుద్దాం ఆహాలో’ అంటూ భారీ డైలాగ్‌ను బాలయ్య చెప్పాడు.
Read Also: పెళ్లిపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
కాగా అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షోకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మేరకు బాలయ్యకు ప్రశాంత్ వర్మ కొన్ని సూచనలు ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తం 12 ఎపిసోడ్లతో తొలి సీజన్‌ను నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షో కోసం బాలయ్యకు భారీ రెమ్యునరేషన్ ముట్టజెప్పనున్నట్లు టాక్ నడుస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.40 లక్షల చొప్పున బాలయ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. కాగా తొలి ఎపిసోడ్‌లో డైలాగ్ కింగ్ మోహన్‌బాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ టాక్ షో ప్రారంభం కానుంది.
Maatallo filter undadu, Saradalo stop undadu, Sye ante sye, Nye ante nye 😎
— ahavideoin (@ahavideoIN) October 27, 2021
Debbaku thinking maaripovala! #UnstoppableWithNBK episode 1 premieres November 4th.
Promo Out Now 💥💥#NandamuriBalakrishna #MansionHouse @swargaseema #NandGokulGhee pic.twitter.com/WdgALLWF7L