భారత ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో ఉన్నారు. రోమ్‌లో జరిగే 16వ జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇటలీ వెళ్లారు. ఈ సందర్భంగా వాటికన్ సిటీలోనూ మోదీ పర్యటించారు. అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం 20 నిమిషాల పాటు కొనసాగాల్సి ఉన్నా.. గంట పాటు కొనసాగిందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో వాతావరణ మార్పులు, కాలుష్యంపై పోరాటం, దారిద్ర్య నిర్మూలన వంటి అనేక అంశాల గురించి చర్చకు…
గత 5 నెలలుగా సాగిన ఉత్కంఠకు నేడు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్‌ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిననాటి నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు హుజురాబాద్ కేంద్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు…
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 306 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనంటూ.. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పోలీసులు షాక్…
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైంది. ఉదయం పలు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని హిమ్మత్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భార్య శ్వేత మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాన్ లోక్సల్స్ ఎందుకు నియోజకవర్గంలో ఉన్నారంటూ, ఓటర్లను ప్రలోభ పెడుతోందంటూ తుల ఉమను గెల్లు శ్వేత…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. వెయిటింగ్ హాలులో అనుమానంగా సంచరిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయి మోనార్క్ ఎక్స్‌ప్రెస్ ద్వారా రవాణా చేస్తోంది. ఈ ముఠాలో ఒడిశాకు చెందిన ఇద్దరు, ముంబైకి చెందిన ఇద్దరు ఉన్నారు. నిందితుల నుంచి 16 లక్షల రూపాయలు విలువ చేసే 54 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. Read Also: ఆగని బాదుడు.. ఈరోజు కూడా పెరిగిన…
బిగ్‌బాస్ 5 సీజన్ ప్రస్తుతం 8వ వారం ముగింపు దశకు చేరుకుంది. ప్రతివారం లాగానే ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్ హాట్‌హాట్‌గా సాగింది. హౌస్‌లో అరుపులు, కేకలకు కొదువ అయితే కనిపించడం లేదు. లహరి, శ్వేత, ప్రియ వంటి వారు ఎలిమినేట్ అయినా సన్నీ, యానీ మాస్టర్ వారి లోటును తీరుస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా సన్నీ చేసిన రచ్చ మాములుగా లేదు. సన్నీ వీక్‌నెస్ తెలిసి శ్రీరామ్ రెచ్చగొట్టడం… సన్నీ మీద మీదకు వెళ్లిపోవడం……
యూపీఐ లావాదేవీలు జరిపేవారికి గూగుల్ పే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ ప్రారంభంలో (అప్పట్లో ‘తేజ్’ యాప్) స్క్రాచ్ కార్డు ఆఫర్ ద్వారా తెగ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా గూగుల్ పే దారినే నమ్ముకుంది. వాట్సాప్ కూడా పేమెంట్స్ కేటగిరిలోకి అడుగుపెట్టడంతో యూజర్లను అట్రాక్ట్ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. దీంతో ఆఫర్లు ప్రకటించాలని నిర్ణయించుకుంది. యూజర్లు వాట్సాప్ పేమెంట్స్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే…
తమ అభిమాన నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం తట్టుకోలేని అభిమానులు అనూహ్య ఘటనలకు పాల్పడుతున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని పలువురు అభిమానులు గుండెపోటుకు గురికాగా మరికొందరు అభిమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణ వార్త విన్న వెంటనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటు రాయచూర్ జిల్లాలో కూడా ఇద్దరు పునీత్ అభిమానులు బసవ గౌడ్, మహ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్థితి…
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు ఇప్పట్లో బ్రేక్ పడే దాఖలాలు కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఎలా ఉన్నా… దేశీయ మార్కెట్‌లో మాత్రం పరుగులు పెడుతున్నాయి. రోజూవారీ ధరల పెంపు కారణంగా పెట్రోల్ ధరలు అడ్డూ, అదుపు లేకుండా పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. శనివారం పెట్రోల్ ధర 36 పైసలు పెరగడంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.36కి చేరింది. అటు…
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎలక్ట్రిక్ బైకుపై నడుపుతున్న ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ‘ఈవీ ట్రేడ్ ఎక్స్పో’ పేరిట జరిగిన విద్యుత్ వాహనాల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన ఎలక్ట్రిక్ బైకును నడుపుతూ ట్రయల్స్ వేశారు. వాయు, శబ్ద కాలుష్యాన్ని ఈ-బైక్స్ ద్వారా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారికి ట్యాక్స్ మినహాయింపులతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్…