కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముగిసే సమయానికి ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఏంలను పోలింగ్ సిబ్బంది సీల్ చేస్తున్నారు. అనంతరం ఈవీంఏంలను భారీ భద్రతతో స్ట్రాంట్ రూంకి తరలించనున్నారు. అయితే సాయంత్రం 5 గంటలకు వరకు 59 గా పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారుల వెల్లడించారు. 2019లో 77 శాతం…
రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతతో ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కోవిడ్ పేషెంట్ల, లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ సమయం ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. అయితే చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. అంతేకాకుండా ఈవీయంలకు ఎన్నికల సిబ్బంది సీల్ వేస్తున్నారు. అక్కడక్కడా చిన్నచిన్న…
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హజురాబాద్ ఉపఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు.పార్టీ శ్రేణుల నుండి అందిన సమాచారం ప్రకారం బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోంది. బీజేపీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. వారందరికీ నా ధన్యవాదాలు. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా…
హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు 306 పోలింగ్ స్టేషన్‌లను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నికల నిబంధనలు ఎవ్వరూ ఉల్లఘించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతామని.. నిజాలు తేలితే ఎన్నికల అనంతరం కూడా…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవలే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్‌మెట్ దరఖాస్తు గడువు డిసెంబర్ 31వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి ఈ గడువును పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఈ పాస్ ద్వారా విద్యార్థులు జనవరి నెల చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు తక్కువ శాతంలో విద్యార్థులు స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారని.. అందుకే దరఖాస్తు గడువును…
యావత్తు ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. కోవిడ్ కారణంగా ఎంతోమంది కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. దీంతో దేశాలు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ కనుగోన్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో వారివారి వ్యాక్సిన్‌లు ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ కరోనా మరోసారి విజృంభించింది. రోజురోజుకు అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 84 శాతం ప్రజలకు 2 డోసులు పూర్తైనప్పటికీ కరోనా ప్రభావం తగ్గడం లేదు. దీంతో సింగపూర్ ప్రభుత్వం బూస్టర్ డోసులను కూడా ప్రజలకు…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. దీంతో ఆమె నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెంది లచ్చవ్వ అనే మహిళ తీవ్ర నడుం నొప్పితో బాధపడుతోంది. దీంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంది. అయినా తగ్గకపోగా.. సమస్య మరింత జఠిలంగా మారింది. కానీ వైద్యులకు ఆమె సమస్య అంతుబట్టలేదు. ఆమెది సహజ నొప్పి అని భావించి మెడిసిన్స్ ఇస్తున్నారు. సుమారు రూ.4…
మన దేశంలో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైలు ప్రయాణాలు ఉచితం లేదా రాయితీలు వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అయితే ఇకపై అలాంటి సౌకర్యాల్లో ఇప్పుడు కోత పడనుంది. ఇప్పటివరకు ఉచితంగా విమానాల్లో ప్రయాణం చేసే ఎంపీలు భవిష్యత్‌లో టిక్కెట్ కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా ప్రైవేట్ పరం కావడమే. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను వేలంపాటలో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన…
భారత ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో ఉన్నారు. రోమ్‌లో జరిగే 16వ జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇటలీ వెళ్లారు. ఈ సందర్భంగా వాటికన్ సిటీలోనూ మోదీ పర్యటించారు. అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం 20 నిమిషాల పాటు కొనసాగాల్సి ఉన్నా.. గంట పాటు కొనసాగిందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో వాతావరణ మార్పులు, కాలుష్యంపై పోరాటం, దారిద్ర్య నిర్మూలన వంటి అనేక అంశాల గురించి చర్చకు…
గత 5 నెలలుగా సాగిన ఉత్కంఠకు నేడు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిననాటి నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో టీఆర్ఎస్ను గెలిపించేందుకు హుజురాబాద్ కేంద్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు…