హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 306 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనంటూ.. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. తన కాన్వాయ్‌లో ఉన్న 3 వాహనాలను అనుమతి లేదంటూ సీజ్ చేశారు. ఈ ఘటన నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మరిపెల్లి గూడెంలో చోటు చేసుకుంది. అంతేకాకుండా ఈటల పీఆర్వోను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.