వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలయ్య ఓ సినిమాలు చెప్పిన డైలాగ్‌కు అనువధించినట్లుగానే ప్రస్తుతం యూట్యూబ్‌లో పరిస్థితి నెలకొంది. అదేంటీ అనుకుంటున్నారా.. అవునండీ.. ఓటీటీలో దూసుకుపోతున్న ఆహాలో నందమూరి బాలకృష్ణ (ఎన్‌బీకే) హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో నిర్వహించారు. ఈ షోకు సంబంధించిన ప్రొమోను ఇటీవల యూట్యూబ్‌లో ఆహా విడుదల చేసింది. దీంతో టీవీల్లో ఇంటర్య్వూలకే ఆసక్తి కనబరచని బాలయ్య ఏకంగా హోస్ట్ చేస్తున్నారా..? ఎలా ఉందో చూడాలి మరీ..? అంటూనే చూసేస్తున్నారు.…
విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటం చేస్తోంది. వారికి సంఘీభావం తెలిపేందుకు విశాఖకు చేరుకున్న పవన్.. కూర్మన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో విన్నవించి విశాఖ ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. అవసరమైతే సీఎం జగన్ అఖిలపక్షాన్ని పిలవండి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతి యువకుడు జైతెలంగాణ…
కడప వాసులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ అందించింది. నవంబర్ 1 నుంచి కడప మీదుగా మరో రెండు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని కడప రైల్వే సీసీఐ ఎం.యానాదయ్య వెల్లడించారు. ఈ రెండు రైళ్లు కడప జిల్లాలో పలు స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తాయని తెలిపారు. ముంబై-చెన్నై మధ్య ప్రతిరోజూ నడిచే 01459 నంబరు గల రైలు ముంబైలో మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3:59 గంటలకు కడప జిల్లా ఎర్రగుంట్లకు, ఉదయం 4:43 గంటలకు కడపకు,…
కామారెడ్డిలో ఓ వివాహత అనుమానస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిప్రసాద్, శిరీష(32)లు దంపతులు. బెంగూళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో వీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం శిరీష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని భర్త హరిప్రసాద్ శిరీష తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు హరిప్రసాదే శిరీషను హత్యచేసి ఆత్మహత్యగా…
ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఓవైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ లతో పాటు ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరిపైఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ నేతలు కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందాలతో గోరఖ్‌పూర్ ఎన్నికల్లో పాల్గొంటున్నారని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ‘మేం చావనైనా చస్తాం..కానీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోం’ అంటూ తీవ్రంగా…
జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు(EMK) షోకు జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్‌కు హోస్టుగా వ్యవహరించిన తారక్ మరోసారి అలాంటి అవతారం ఎత్తిన షో EMK మాత్రమే. ఈ షో సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8:30 గంటలకు ప్రసారమవుతోంది. కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దీంతో EMK ఫస్ట్ వీక్ టీఆర్పీ 6.76గా నమోదైంది. Also Read: “అనుభవించు…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై పలు విమర్శనాస్త్రాలు సంధించారు. మంచిర్యాలకు చెందిన మహేశ్ అనే యువకుడు జాబ్ నోటిఫికేషన్‌లు రావడం లేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్పందించిన రేవంత్ రెడ్డి మరణం.. కాదు రణం చేద్దామంటూ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఓవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యవత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే భారీగా పెట్టుబడులు తీసుకువస్తున్నాం.. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ కబుర్లు చెప్పుకోవడానికి కేటీఆర్ సిగ్గులేదా అంటూ.. ఆగ్రహం వ్యక్తం…
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయకుండా ఉండాలని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉక్కు పరిరక్షణ సమితికి సంఘీభావం తెలుపేందుకు ఈ రోజు విశాఖకు చేరుకున్నారు. ఈ క్రమంలో కూర్మన్నపాలెం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. విశాఖకు చేరుకున్న జనసేనాని సభాస్థలికి చేరుకోనున్నారు. అనంతరం ఉక్కు కార్మికులకు…
ఉత్తరాఖండ్‌లో దారుణఘటన చోటు చేసుకుంది. లోయలో బస్సు పడిపోవడంతో 13 మంది మృతి చెందారు. అంతేకాకుండా చాలా మందికి తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని చక్రటలో గల బులద్-బైలా రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదస్థలం కొండలోయలో కావడంతో అత్యవసర సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డెహ్రడూన్‌కు ఘటన స్థలం 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సేవలు అందిస్తున్నారు. బస్సు…
వేటగాళ్ల చేతిలో పులి బలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొందరు నిందితులు పులికోసం ఉచ్చు బిగించి పులిని హతమార్చినట్లు తెలుస్తోంది. పులి చర్మాన్ని కాగజ్‌నగర్ కు తరలిస్తుండగా వారు పట్టుబడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుల నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా ఇంద్రవెల్లి మండలంలోని వాల్గొండ సమీపంలో గల హీరాపూర్ అటవీప్రాంతంలో పులిని చంపినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఈ మేరకు…