బిగ్‌బాస్ 5 సీజన్ ప్రస్తుతం 8వ వారం ముగింపు దశకు చేరుకుంది. ప్రతివారం లాగానే ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్ హాట్‌హాట్‌గా సాగింది. హౌస్‌లో అరుపులు, కేకలకు కొదువ అయితే కనిపించడం లేదు. లహరి, శ్వేత, ప్రియ వంటి వారు ఎలిమినేట్ అయినా సన్నీ, యానీ మాస్టర్ వారి లోటును తీరుస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా సన్నీ చేసిన రచ్చ మాములుగా లేదు. సన్నీ వీక్‌నెస్ తెలిసి శ్రీరామ్ రెచ్చగొట్టడం… సన్నీ మీద మీదకు వెళ్లిపోవడం… యానీ మాస్టర్ భావోద్వేగానికి లోనై టాస్క్ నుంచి తప్పుకోవడం ఈ వీక్‌లో హైలైట్ పాయింట్స్ అని చెప్పాలి. అయితే సన్నీ వ్యవహారంపై వీకెండ్‌లో నాగార్జున గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడని ప్రోమో చూస్తే అర్ధమవుతోంది. అందులో తనను ప్రొవోక్ చేశారని సన్నీ చెప్పినా… ‘అయినా మీదమీదకు వెళ్లిపోతావా? కాలితో తంతావా? నిన్ను ఎంతమంది పట్టుకుని ఆపారో తెలుసా?’ అంటూ నాగ్ మండిపడుతూ సన్నీ ఫోటో చింపేశాడు. మరోవైపు కాజల్‌కు కూడా నాగ్ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సంచాలకుడిగా జెస్సీపై విమర్శలు చేసిన మానస్‌కు కూడా నాగ్ గట్టిగానే ఇచ్చిపడేశాడు.
Weekend is here and @iamnagarjuna warns housemates for their mistakes #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFire and #FiveMuchFun pic.twitter.com/eBGcp77qYa
— starmaa (@StarMaa) October 30, 2021
ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఆరుగురు ఉన్నారు. వారిలో లోబో, రవి, సిరి, షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర ఉన్నారు. ఈ వారం లోబోకు చాలా తక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అందువల్ల లోబో ఈ వారం ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. గత వారం బిగ్‌బాస్ అతడిని సీక్రెట్ రూంలోకి పంపినా ఉపయోగం అయితే కనిపించలేదు. మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా టాస్కుల్లో బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుంటే అదీ జరగలేదు. ఈ అంశాలు అతడికి పడే ఓట్లపై ప్రభావం చూపించాయి.
Read Also: సినిమా రివ్యూ: రొమాంటిక్