ఫ్రెంచ్ సెనేట్‌లో ‘యాంబిషన్ ఇండియా-2021’ బిజినెస్ ఫోరంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ఏడేళ్లలో తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో టీఎస్ ఐపాస్ గురించి కూడా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రమని, తెలంగాణ ప్రభుత్వ టీఎస్ ఐపాస్ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ ధృవీకరణను అనుమతిస్తుందని కేటీఆర్ చెప్పారు. చట్టం ప్రకారం 15 రోజులలో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి…
తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాడు ఉప ఎన్నికల హడావిడి నెలకొంది. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం నాడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.ముఖ్యంగా హుజురాబాద్‌లో పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా కాస్ట్‌లీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో గెలుపు ఇరుపార్టీలకు చాలా అవసరం. ప్రజల్లో తమపై వ్యతిరేకత…
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ ‘మంగళవారం మరదలు’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడలేదని.. ఏకవచనం వాడలేదని క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడిన భాషలో ఏదైనా తప్పు ఉంటే చింతిస్తున్నానని వెల్లడించారు. షర్మిల తన కుమార్తె కంటే పెద్దది… సోదరి కంటే చిన్నది. తండ్రి సమకాలీకుడైన సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో ఆమె సంభోదించడం సంస్కారమేనా?’ అని నిరంజన్‌రెడ్డి షర్మిలకు చురకలు అంటించారు.…
దీపావళి పండగ వేళ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గుడ్ న్యూస్ అందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అందించే వడ్డీని దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనుంది. దీంతో దాదాపు 6.5 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని చందాదారులకు పండగకు ముందే అందించనున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ విషయమై త్వరలోనే…
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో భాగంగా షార్జాలో జరిగిన బంగ్లాదేశ్-వెస్టిండీస్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరకు వెస్టిండీస్ జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. వెస్టిండీస్ టాపార్డర్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4), హెట్‌మెయిర్ (9), ఆండ్రీ రస్సెల్ (0) విఫలమయ్యారు. బ్యాటింగ్ చేస్తూ మధ్యలో మైదానాన్ని వీడిన కెప్టెన్ పొలార్డ్…
2019తో పోలిస్తే 2020లో దేశవ్యాప్తంగా 18 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల అంశంపై నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో 10,677 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ జాబితాలో మహారాష్ట్ర టాప్‌లో నిలిచింది. ఆ రాష్ట్రంలో 4,006 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలు టాప్-5లో ఉండటం గమనించాల్సిన విషయం. Read Also: వాహనదారుల్లో రాని మార్పు 2020లో రైతుల…
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల కావాల్సిన ‘రౌద్రం రణం రుధిరం (RRR)’ టీజర్ గ్లింప్స్ వాయిదా పడింది. త్వరలో టీజర్ గ్లింప్స్ విడుదల తేదీపై క్లారిటీ ఇస్తామని RRR యూనిట్ తెలిపింది. ఈ టీజర్ గ్లింప్స్ నిడివి 40 సెకన్ల పాటు ఉంటుందని తెలుస్తోంది. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల చేయాలని భావించారు. అందులో భాగంగా…
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. భారత ప్రధాని మోదీ కూడా పునీత్ మృతి పట్ల సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘విధి ఎంతో క్రూరమైనది. పునీత్ రాజ్‌కుమార్ లాంటి ఒక గొప్ప వ్యక్తి, మంచి నటుడిని మనందరికీ దూరం చేసింది. పునీత్ రాజ్‌కుమార్ కృషి, వ్యక్తిత్వం భవిష్యత్ తరాలలో స్ఫూర్తి నింపుతుంది. మీది చనిపోయే వయసు కాదు. పునీత్ కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి..…
తిరుపతి నగర వాసులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త అందించారు. తిరుపతికి వచ్చే యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టిన శ్రీనివాస సేతు (గరుడ వారధి)ని నవంబరులో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గిరీష్, ఆఫ్ కాన్ సంస్థ ప్రతినిధి రంగ స్వామి ఇతర అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. Read Also: తెలుగుకి ఇప్పుడు…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం నాడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరోవైపు తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పునీత్ భౌతిక కాయాన్ని విక్రమ్ ఆస్పత్రి నుంచి సదాశివనగర్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ క్రమంలో తమ అభిమాన…