పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో భారీ అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖనిలోని లక్ష్మీనగర్ ఫ్యాషన్ వరల్డ్ మెన్స్ వేర్ లో తెల్లవారు జామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే బట్టలకు సంబంధించిన దుకాణం కావడంతో మంటలు భారీగా చెలరేగి ఆగ్నికీలలు పక్కనే ఉన్న దుకాణాలపై పడి మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి…
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 27 రోజులకే ఓ నవవధువు అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన పాతబస్తీలోని రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పాతబస్తీ కి చెందిన రషీద్, షఫియా ఫాతిమా (21) లకు 27 రోజుల క్రితం వివాహం జరిగింది. అయితే ఏంజరిగిందో ఏమో తెలియదు గానీ.. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో రషీద్ ఇంట్లో ఫాతిమా మృతదేహం అనుమానస్పద స్థితిలో లభ్యమైంది. ఈ మేరకు కేసు…
సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర నవంబర్ 1న ప్రారంభమైంది. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ ప్రారంభించిన ఈ మహాపాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలకు చేరుకోనుంది. అయితే నేడు 27వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో 12 కిలోమీటర్ల మేర కొనసాగనున్న రైతుల పాదయాత్ర అంబాపురం వద్ద ముగియనున్నట్లు అమరావతి రైతుల జేఏసీ…
తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 15 రోజుల నుంచి తమిళనాడులో తగ్గేదేలే అన్నట్లుగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో చెన్నై సహా 23 జిల్లాలోని స్కూల్స్ కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిన్న రాత్రి నుంచి చెన్నైలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. Also Read : అండమాన్‌లో అలజడి.. మరోసారి ఏపీకి భారీ వర్షసూచన.. అంతేకాకుండా మెరీనా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీ విడుదల సమయం దగ్గర పడుతోంది. మరో నెల మాత్రమే ఈ సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. తాజాగా సెన్సార్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.…
ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి సీఎం జగన్ శుభవార్త అందించారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ఆరోగ్య రంగం అభివృద్ధిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమని.. ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని…
ప్రధాని మోడీపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ జీ 7 సంవత్సరాల నుండి రోజుకు 18 గంటలు పని చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ (గౌతమ్ అదానీ)ను ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా మారే కలను సాకారం చేసుకున్నారంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే గతంలో చైనాకు చెందిన ఓ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 5.30 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నారని.. ఆయన పెండింగ్‌లో…
మరోసారి ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే ఆయన మాటలపై స్పందించిన మంత్రి కొడాలి నాని.. శవాల మీద చిల్లర ఏరుకునే చిల్లర నాయుడు రాష్ట్రంలో ఉండటం దురదృష్టం మంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జిల్లాల్లో జరిగిన నష్టం అందరికీ తెలుసు… సీఎం వెంటనే స్పందించి అన్నీ చేస్తున్నారని ఆయన అన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారు… పునరుద్ధరణకు…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి పండుగ మళ్లీ మొదలైంది. అదేంటి అనుకుంటున్నారా.. అవునండి మొన్నటి వరకు భారీ వర్షాలతో గంజాయి రవాణా ముఠాకు అడ్డంకి వచ్చిపడింది. ఇప్పుడు కొంచెం వరుణుడు విరామం తీసుకుందామని తెలుగు రాష్ట్రాలకు సెలవు ప్రకటించాడో లేదో.. మళ్లీ గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి. అయితే వారు రెచ్చిపోతే మేము తగ్గేదేలే అంటున్నారు పోలీసులు. తాజాగా హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు…
చంద్రబాబు నేటి ఉదయం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రోజా. తిరుపతిలో మీడియా ముందు చంద్రబాబు మాట్లాడిన విధానం చూస్తుంటే త్వరలోనే చంద్రబాబును పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించాలని అందరికీ అర్థమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో భారీ వర్షాల కారణంగా సరిహద్దు ప్రాంతాలను సీఎం జగన్ అప్రమత్తం చేశారని.. అంతేకాకుండా ఆ తరువాత భారీ వర్షాలతో నష్టపోయిన జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు…